సత్య దేవ్, డాలీ ధనంజయ – ‘జీబ్రా’ దీపావళికి అక్టోబర్ 31న థియేట్రికల్ రిలీజ్

0
58
Satya Dev, Daali Dhananjaya -Zebra Theatrical Release On October 31 For Diwali
Satya Dev, Daali Dhananjaya -Zebra Theatrical Release On October 31 For Diwali

సత్య దేవ్, డాలీ ధనంజయ, ఈశ్వర్ కార్తీక్, పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ‘జీబ్రా’ మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్ విడుదల, దీపావళికి అక్టోబర్ 31న థియేట్రికల్ రిలీజ్

ట్యాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ మోస్ట్ ఎవైటెడ్ మల్టీ-స్టారర్ ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఈ రోజు, మేకర్స్ ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్‌తో రిలీజ్ చేశారు, మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు.

మోషన్ పోస్టర్ సత్యరాజ్, సత్య అక్కల, జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, డాలీ ధనంజయ, సత్య దేవ్‌లని పరిచయం చేసింది. ప్రతి పాత్రను ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్ తో ప్రజెంట్ చేశారు. మోషన్ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది.

చివరి ఫ్రేమ్‌లలో మొత్తం నటీనటులు కనిపిస్తున్నారు. మోషన్ పోస్టర్‌లో కాయిన్ తిప్పడం, కరెన్సీ నోట్లు,  ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుండి కారు దూకడం వంటి ఎక్సయిటింగ్ డైనమిక్ ఎలిమెంట్స్ క్రియేటివ్ గా ప్రజెంట్ చేశారు. రవి బస్రూర్ అందించిన ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్ ని మరింత పెంచింది. ఈ మైండ్ బ్లోయింగ్ మోషన్ పోస్టర్ ద్వారా జీబ్రా అక్టోబర్ 31న అన్ని దక్షిణ భారత భాషల్లో,హిందీలో థియేటర్లలోకి రానుందని అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ డేట్ ఈ దీపావళి మరింత స్పెషల్ వుండబోతోందని ప్రామిస్ చేస్తోంది.    

లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాత. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్.

తారాగణం: సత్య దేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో, సత్య అక్కల, సునీల్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
ఎడిషనల్ స్క్రీన్ ప్లే: యువ
నిర్మాతలు: SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం
బ్యానర్లు: పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్,  ఓల్డ్ టౌన్ పిక్చర్స్
సహ నిర్మాత: ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి
డీవోపీ: సత్య పొన్మార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్: అనిల్ క్రిష్
డైలాగ్స్: మీరాఖ్
స్టంట్స్: సుబ్బు
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్విని ముల్పూరి, గంగాధర్ బొమ్మరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here