రోరింగ్ స్టార్ శ్రీముర‌ళి హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘బఘీర’… అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

0
32
Roaring Star Sreemurali Bhageera Slated For October 31st Release
Roaring Star Sreemurali Bhageera Slated For October 31st Release

రోరింగ్ స్టార్ శ్రీముర‌ళి హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘బఘీర’… అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

రోరింగ్ స్టార్ శ్రీమురళి కథానాయకుడిగా కె.జి.యఫ్, కాంతార, సలార్ వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘బఘీర’. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి క‌థ‌ను అందించారు. హోంబ‌లే ఫిలిమ్స్ మేకింగ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అలాంటి పెస్ట్రీజియ‌స్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ రూపొందిస్తోన్న ఈ మూవీ తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 31న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

బ‌ఘీర రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. అందులో ఓ మాస్క్‌ను చూపిస్తున్నారు. డిఫ‌రెంట్ లుక్లో ఉన్న ఈ మాస్క్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ‘బఘీర’ మూవీ పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ సినిమాపై అంచనాల‌ను పెంచాయి. శ్రీముర‌ళి ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో అల‌రించ‌బోతున్నారు. ఎ.జె.శెట్టి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి బి.అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

న‌టీన‌టులు:

శ్రీముర‌ళి, రుక్మిణి వ‌సంత్, ప్ర‌కాష్ రాజ్‌, రంగ‌యాణ ర‌ఘు, అచ్యుత్ కుమార్‌, గ‌రుడ రామ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌:  హోంబ‌లే ఫిలిమ్స్‌, నిర్మాత:  విజ‌య్ కిర‌గందూర్‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్ష‌న్‌:  డాక్ట‌ర్ సూరి, సినిమాటోగ్ర‌పీ: ఎ.జె.శెట్టి, మ్యూజిక్‌:  బి.అజ‌నీష్ లోకనాథ్‌, ఎడిట‌ర్‌:  ప్ర‌ణవ్ శ్రీప్ర‌సాద్‌, యాక్ష‌న్‌:  చేత‌న్ డిసౌజా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  యోగి జి.రాజ్‌, అభిజీత్, ఆర్ట్‌: ర‌వి, కాస్ట్యూమ్స్‌:  యోగి.జి.రాజ్‌, పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here