శర్వానంద్, రామ్ అబ్బరాజు, రామబ్రహ్మం సుంకర, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ #Sharwa37 నుంచి దియా గా సంయుక్త పరిచయం
చార్మింగ్ స్టార్ శర్వానంద్ 37వ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సామజవరగమనతో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
హిలేరియస్ రైడ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడిగా సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంయుక్త పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, పోస్టర్ ద్వారా ఆమె పాత్రను దియా గా పరిచయం చేశారు మేకర్స్. సంయుక్త సంప్రదాయ శాస్త్రీయ నృత్యం చేస్తూ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫర్. భాను బోగవరపు కథ అందించగా, నందు సావిరిగాన డైలాగ్స్ రాశారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాత, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
తారాగణం: శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య
సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
కథ: భాను బోగవరపు
డైలాగ్స్: నందు సవిరిగాన
సహ నిర్మాత: అజయ్ సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: విశ్వ సీఎం