సెప్టెంబర్ 20 న విడుదల అవుతున్న గొర్రె పురాణం

0
56
'Gorre Puranam' set to hit the screens on September 20th
'Gorre Puranam' set to hit the screens on September 20th

సెప్టెంబర్ 20 న విడుదల అవుతున్న గొర్రె పురాణం

మంచి కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న హీరో సుహాస్. కలర్ ఫోటో చిత్రంతో హీరో గా తన ప్రస్థానం మొదలు పెట్టాడు. వరుసగా రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న విధానం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ చిత్రం తో సెప్టెంబర్ 20 న మన ముందుకు వస్తున్నాడు సుహాస్.

ఫోకల్ వెంచర్స్ పతాకం పై సుహాస్ హీరో గా బాబీ దర్శకత్వం లో ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న వినూత్న కథ చిత్రం “గొర్రె పురాణం”. ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదల అయిన టీజర్ కి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 20 న విడుదల అవుతుంది.

ఇది ఒక గొర్రె కథ, ఒక గ్రామంలో హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టిన ఒక గొర్రె కథ. కథ చాలా కొత్తగా ఉంటుంది. మంచి కథ కథనం  తో సోషల్ మెసేజ్ ఉన్న వినూత్న కథ. సుహాస్ చాలా బాగా నటించాడు. పవన్ సి హెచ్ స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. ‘భలే భలే’ మరియు ఓ రారే రారే లిరికల్ పాటలు విడుదలై  గొర్రె పురాణం చిత్రం మీద అంచనాలు పెంచాయి. ఈ చిత్రం లో గొర్రె కి దర్శకుడు నటుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

మా చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 20న విడుదల అవుతుంది” అని దర్శక నిర్మాతలు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here