కన్నడ సూపర్ స్టార్ డా. శివ రాజ్‌కుమార్ లాంచ్ చేసిన అద్వయ్, పి రవిశంకర్, తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల, ఎస్‌జి మూవీ క్రియేషన్స్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సుబ్రహ్మణ్య’ ఫస్ట్ లుక్
పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన దర్శకత్వంలో “సుబ్రహ్మణ్య”సినిమాతో తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఎస్‌జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల, శ్రీమతి రామలక్ష్మి సమర్పణలో ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.
వినాయక చతుర్థి సందర్భంగా సుబ్రహ్మణ్య నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కన్నడ సూపర్ స్టార్ డా. శివ రాజ్‌కుమార్ లాంచ్ చేసిన పోస్టర్‌లో అద్వాయ్‌ని టైటిల్ రోల్‌లో సుబ్రహ్మణ్యగా పరిచయం చేశారు. పొడవాటి జుట్టు, గడ్డం,స్పెషల్ గా డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ లో అద్వయ్ అద్భుతంగా కనిపించాడు. తన లుక్స్ లో ఇంటన్సిటీ కనిపిస్తోంది. విజువల్ ట్రీట్ లా వున్న ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ చిత్రం ఇప్పటికే 60% నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముంబయిలోని ప్రముఖ రెడ్ చిల్లీస్ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నాయి. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ప్రముఖ స్టూడియోలలో VFX & CGI పనులు జరుగుతున్నాయి.
సుబ్రహ్మణ్య సినిమా టెక్నికల్‌గా ఉన్నతంగా ఉండబోతుంది, దీనికి టాప్ నాచ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. కెజిఎఫ్, సాలర్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, విఘ్నేష్ రాజ్ సినిమాటోగ్రాఫర్. విజయ్ ఎం కుమార్ ఎడిటర్. సప్త సాగరదాచే & చార్లీ 777 ఫేమ్ ఉల్లాస్ హైదూర్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్.
పాన్ ఇండియా మూవీ సుబ్రహ్మణ్య తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తారాగణం:
అద్వయ్
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: SG మూవీ క్రియేషన్స్
సమర్పణ: శ్రీమతి ప్రవీణ కడియాల & శ్రీమతి రామలక్ష్మి
నిర్మాతలు: తిరుమల్ రెడ్డి & అనిల్ కడియాల
దర్శకత్వం: పి.రవిశంకర్
సంగీతం: రవి బస్రూర్
డిఓపి: విఘ్నేష్ రాజ్
ఎడిటర్: విజయ్ ఎం కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: ఉల్లాస్ హైదూర్
పీఆర్వో: వంశీ-శేఖర్