మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాగ్నానిమస్ వరల్డ్ #SDT18 నుంచి వసంతగా ఐశ్వర్య లక్ష్మి పరిచయం

0
37
Aishwarya Lekshmi As Vasantha From #SDT18
Aishwarya Lekshmi As Vasantha From #SDT18

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ మాగ్నానిమస్ వరల్డ్ #SDT18 నుంచి వసంతగా ఐశ్వర్య లక్ష్మి పరిచయం

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ స్ట్రాంగ్ కంటెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. ‘విరూపాక్ష’, ‘బ్రో’  బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత,  రోహిత్ కెపి దర్శకుడిగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత, నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై  ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు

ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ కి ప్రాముఖ్యత ఉంది, మేకర్  సాయి దుర్గ తేజ్ సరసన నటించడానికి మోస్ట్ ట్యాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మిని ఎంపిక చేశారు. ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా వసంతగా ఆమె క్యారెక్టర్ ని పరిచయం చేశారు. ఎడారి లాంటి ల్యాండ్‌స్కేప్‌లో సెట్ చేసిన పోస్టర్ లో ఐశ్వర్య లుక్ ఆకట్టుకుంది.

ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో వేసిన మ్యాసీఇవ్ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన సరికొత్తగా మేకోవర్‌ అయ్యారు.

ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రోహిత్ కె.పి
నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
పీఆర్వో: వంశీ-శేఖర్

#SDT18 Aishwarya Lekshmi As Vasantha Read English Article Here >>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here