నేచురల్ స్టార్ నాని ‘HIT: The 3rd Case’ అనౌన్స్ మెంట్, అర్జున్ సర్కార్-హంటర్స్ కమాండ్

0
48
Natural Star Nani HIT:The 3rd Case Announced Arjun Sarkaar
Natural Star Nani HIT:The 3rd Case Announced Arjun Sarkaar

నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్, ‘HIT: The 3rd Case’ అనౌన్స్ మెంట్, అర్జున్ సర్కార్-హంటర్స్ కమాండ్ స్టైలిష్ & ఇంటెన్స్ గ్లింప్స్ విడుదల, మే 1, 2025న థియేట్రికల్ రిలీజ్

డిఫరెంట్ జోనర్‌లలో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’తో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్‌ను కంప్లీట్ చేశారు. తన 32వ సినిమాతో మరో మైల్ స్టోన్ జర్నీ ప్రారంభించబోతున్నారు. నాని క్యారెక్టర్ పై స్నీక్ పీక్ అందిస్తూ, గ్రిప్పింగ్ గ్లింప్స్ ద్వారా ఈరోజు HIT: The 3rd Case’ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా,యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.

హంటర్స్ కమాండ్ గ్లింప్స్ HIT ఆఫీసర్ మంచు పర్వతాలలో కారు నడుపుతూ, అతనిని వెంబడిస్తున్న ఇద్దరు పోలీసు ఆఫీసర్స్ తో ఇంట్రస్టింగ్ నోట్‌తో ప్రారంభమైయింది.  HIT ఆఫీసర్ దేజంర్ లో ఉన్నారని ఒక అధికారి మరొకరు హెచ్చరించడంతో టెన్షన్ బిల్డ్ అయింది. అయితే తను దేజంర్ లో లేడని, తనే డేంజర్ అని పోలీస్ ఆఫీసర్ చెప్పిన తర్వాత అర్జున్ సర్కార్ గా నాని కనిపించడం టెర్రిఫిక్ గా వుంది.

నాని సిగార్ తాగుతూ, కారు నడుపుతూ రక్తపు చేతులు, గొడ్డలితో స్టైలిష్ అండ్ ఫెరోషియస్ గా కనిపించారు. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లో ఆదరగొట్టారు. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా వుండబోతోంది.

HIT ఫ్రాంచైజీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ మూవీస్ ని అందించిన డైరెక్టర్  శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న  ‘HIT: The 3rd Case’ మరింత ప్రతిష్టాత్మకంగా ఉండనుంది. టీజర్ సినిమా స్టైలిష్, ఇంటెన్స్, గ్రాండ్ నెస్ ని ప్రజంట్ చేస్తోంది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ సంగ్రహించిన విజువల్స్ బ్రెత్ టేకింగ్ గా వున్నాయి.  మిక్కీ జె మేయర్ పవర్ ఫుల్ బీజీఎం తో ఇంటెన్సిటీ  పెంచారు. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.

హంటర్స్ కమాండ్ గ్లింప్స్ అద్భుతంగా వుంది. HIT సిరీస్ థర్డ్ ఇన్స్టాల్ మెంట్ లో అర్జున్ సర్కార్ పాత్ర ఎంత ఇంటెన్స్ గా ఉండబోతుందో తెలుసుకోవాలనే క్యురియాసిటీని పెంచింది.

మే 1, 2025న వేసవిలో HIT 3 థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.

తారాగణం: నాని

సాంకేతిక సిబ్బంది

రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
బ్యానర్లు: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్
డీవోపీ: సాను జాన్ వర్గీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
సౌండ్ మిక్స్: సురేన్ జి
లైన్ ప్రొడ్యూసర్: అభిలాష్ మాంధపు
చీఫ్ కో-డైరెక్టర్: వెంకట్ మద్దిరాల
కాస్ట్యూమ్ డిజైనర్: నాని కమరుసు
SFX: సింక్ సినిమా
VFX సూపర్‌వైజర్: VFX DTM
DI: B2h స్టూడియోస్
కలర్స్: S రఘునాథ్ వర్మ
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here