వరద బాధితుల సహాయార్థం రూ.6 కోట్ల భారీ విరాళం ప్రకటించి గొప్ప మనసు చాటుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా సంభవించిన విధ్వంసాన్ని చూసి చలించిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందించనున్నారు. అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడ్డ 400 పంచాయతీలకు.. ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4 కోట్లు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు.
మొత్తంగా, పవన్ కళ్యాణ్ ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి వ్యక్తిగతంగా రూ. 6 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మరియు పంచాయతీరాజ్ మంత్రిగా రాష్ట్రంలోని ప్రతి వరద ప్రభావిత ప్రాంతం వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండంతో పాటు, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.