‘సీతారాం సిత్రాలు’ మూవీ రివ్యూ
టైటిల్: సీతారాం సిత్రాలు
తారాగణం : లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక, ఆకెళ్ళ రాఘవేంద్ర, సందీప్ వారణాసి, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి వంజరి
బ్యానర్: రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణ చంద్ర విజయ బట్టు
రచన, దర్శకత్వం: డి.నాగ శశిధర్ రెడ్డి
కెమెరామెన్: అరుణ్ కుమార్ పర్వతనేని
మ్యూజిక్: రుద్ర కిరణ్
సీతారాం సిత్రాలు కథ
కర్నూలు దగ్గరలో ఒక చిన్న టీ స్టాల్ నడుపుకుంటూ ఉంటాడు శివ(లక్ష్మణమూర్తి). మంచి మాటలను వాట్సప్‌లో స్టేటస్‌గా పెడుతూ ఉండడంతో ‘స్టేటస్ శివ’ అని పిలుస్తూ ఉంటారు. అనుకోకుండా టీచర్‌గా పని చేసే పార్వతి( భ్రమరాంబిక)తో ప్రేమలో పడగా ఆమెతోనే అనూహ్యంగా పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని భారీగా అప్పు చేసి ఏర్పాట్లు చేసుకున్న తరువాత పెళ్లికూతురు తండ్రి పెళ్లిని ఆపేస్తాడు. దీంతో ఏం చేయాలో తెలియక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు. సరిగ్గా ఇదే సమయంలో విలన్ ఎంట్రీ ఇవ్వగా శివ లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? అసలు పెళ్లి ఎందుకు ఆగింది? శివ జీవితంలో సక్సెస్ అయ్యాడా? లేదా? అనుకున్న అమ్మాయితో శివ పెళ్లి జరిగిందా? అనేది తెలుసుకోవాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మెన్స్
హీరోగా చేసిన లక్ష్మణ మూర్తి సరిగ్గా పాత్రకు సెట్ అయ్యాడు. మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితంలో సక్సెస్ అయ్యే లక్ష్యం గల టీస్టాల్ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్ భ్రమరాంబిక తనదైన అందంతో ఆకట్టుకుంది. టీచర్ పాత్రలో క్యూట్ గా కనిపించింది. తనదైన శైలితో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక హీరో తల్లి పాత్రలో నటించిన ఢిల్లీ రాజేశ్వరి తన పాత్రలో జీవించారు. ఇక మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
టెక్నికల్ టీం
విషయానికి వస్తే దర్శకుడు నాగ శశిధర్ నూతన నటీనటులతో చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం. దర్శకుడిగా తీను చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా చెప్పడంలో కొంత తడబడినా సక్సెస్ అయ్యాడు. అరుణ్ కుమార్ పర్వతనేని సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. అయితే రుద్ర కిరణ్ ఇచ్చిన సంగీతం రణగొణ ధ్వనులు లేకుండా వినసొంపుగా ఉంది. నిర్మాతలు పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణ చంద్ర విజయ బట్టు సీతారాం సిత్రాలు అనే సినిమాను మంచి నిర్మాణ విలువలతో నిర్మించారు.
విశ్లేషణ
దర్శకుడు నాగ శశిధర్ కుటుంబం మొత్తం కలిసి చూసేలా సీతారాం సిత్రాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సీతారాం సిత్రాలు కంటెంట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో నిశ్చితార్థం, పెళ్లి, నామకరణం లాంటి శుభకార్యాలలో తీసిన ఫొటోలను, వీడియోలను మధుర జ్ఞాపకాలుగా దాచుకుంటారు. అయితే గతంలో వీసీఆర్ క్యాసెట్‌లో వాటిని భద్రపరిచేవారు. ఈ పాయింట్‌ను తీసుకుని దర్శకుడు నాగ శశిధర్ కథను నడిపించిన తీరి ఆకట్టుకుంది. మనసుకు నచ్చిన పనిని మరింత ఇష్టంగా చేస్తే విజయం వరిస్తుందని చెబుతూనే బంధువులు మాటలు చెప్పడానికే కానీ, మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ఉండరు అనే విషయాన్ని బల్లగుద్ది చెప్పాడు. దర్శకుడు నాగ శశిధర్ తను ఎంచుకున్న పాయింట్‌ను చెప్పడంలో ఎక్కడా తడబడకుండా కథను నడిపించాడని చెప్పొచ్చు. అయితే అయితే సెకెండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేదనడంలో సందేహం లేదు. అలాగే అందరూ కొత్తవాళ్లే కాకూండా కీలకమైన పాత్రల్లో కొంచెం తెలిసిన వాళ్లను తీసుకుని ఉంటే సినిమా వేరే లెవల్లో ఉండేది. మాములుగా కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో చాలా వరకు ఫ్యాక్షన్ సినిమాలు చేస్తే డైరెక్టర్ నాగ శశిధర్ మాత్రం కొత్త పంథాలో క్యూట్ లవ్ స్టోరీతో కూడిన సందేశాత్మక చిత్రాన్ని అందించిన యత్నం అభినందనీయం.
‘సీతారాం సిత్రాలు’ ఒక ప్లెజెంట్ ఫీల్ ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ
రేటింగ్: 3/5