తెలుగు సినీ ప్రముఖులు – కోల్కత్త బాధితురాలి కుటుంబానికి సంఘీభావం

0
84
Telugu Film Industry against Kolkata rape & murder
Telugu Film Industry against Kolkata rape & murder

కోల్కత్త లో ఒక డాక్టర్ ని రేప్ చేసి హత్య చేసిన సంగతి మనందరికీ విదితమే. ఇప్పటికీ ఈ కేసు విషయం లో దేశవ్యాప్తంగా ధర్నాలు జరిగాయి. చాలా మంది మెడికోలు కూడా తమ సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యం లో తెలుగు సినీ ప్రముఖులు బాధితురాలి కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ వాక్ నిర్వహించారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, డైరక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీర శంకర్, నిర్మాత ఎస్ కె యెన్, జీవిత రాజశేఖర్, హీరోయిన్ కామాక్షి భాస్కరాల, అమ్మిరాజు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

రైటర్ అసోసియేషన్ సెక్రెటరీ ఏ యెన్ రాధా మాట్లాడుతూ “ఇవాళ సమాజం లో స్త్రీల పై జరగుతున్న దాడులు చూస్తుంటే, స్త్రీలకి సమాంతర గౌరవం దొరకట్లేదనిపిస్తుంది. స్త్రీ కి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. అందుకోసం ప్రభుత్వం వైపు చూడకుండా, మన సంస్థల్లో, మన చుట్టుపక్కల, స్త్రీలని ఎలా ప్రొటెక్ట్ చేయాలో ఆలోచించుకోవాలి. కలకత్తా లో జరిగిన సంఘటన ని మా యూనియన్ తీవ్రంగా ఖండిస్తోంది” అని చెప్పారు.

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, “నిజం చెప్పాలంటే, నాకు మాటలు రావట్లేదు. జరిగిన సంఘటన చూస్తుంటే చాలా బాధేస్తుంది. మనం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ముందు, మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం అని ఆలోచించుకోవాలి. వుమెన్ ప్రొటెక్షన్ సెల్ ని అన్ని యూనియన్ల లో పెట్టాలని నిర్ణయించుకున్నాం. స్త్రీలని గౌరవించుకొనేందుకు తగిన చర్యలు తీసుకుంటాం” అన్నారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ, “నేను ముప్పైయేళ్లు గా ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ ఇండస్ట్రీ నాకు బాగా గౌరవం ఇచ్చింది. కానీ ఆడపిల్లల గురించి ఆలోచిస్తుంటే బాధేస్తుంది. ఎంతో మంది ఇంటి పనుల తో పాటు కుటుంబాన్ని నడపాలని ఉద్దేశ్యం తో అన్ని ఫీల్డ్ లో రాణిస్తున్నారు. మన చుట్టుపక్కల ఎవరైనా సరిగా బిహేవ్ చెయ్యట్లేదు అంటే ఆడవాళ్ళూ వెంటనే పసిగట్టి ఇంట్లో వాళ్ళ తో మాట్లాడాలి. మనం మన సెక్యూరిటీ కూడా చూసుకోవాలి. ఇలాంటి ఇష్యుస్ జరుగుతున్నది అన్నప్పుడు మనకి మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక తల్లి గా, కోల్కత్తా లో ఆ అమ్మాయికి జరిగింది ఆలోచిస్తుంటే బాధేస్తుంది. ” అని అన్నారు.

“జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. అంత వికృతమైన మెడికల్ కాలేజీ ఈ దేశంలో లేదు. గత 10 సంవత్సరాల నుండి ఉన్న ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకోకుండా ఒక క్రైమ్ సెంటర్ ల తయారు చేసారు. ఇలాంటి వాటికీ మనం మూల్యాలు ఎక్కడినుండి వస్తున్నాయో ఆలోచించాలి. తల్లి తండ్రులు వారి పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా సమావేశాలు పెట్టడమే కాకుండా మన తెలుగు చిత్రపరిశ్రమ తరపున హీరోలు, డైరెక్టర్లు మరియు సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉన్న అందరు వ్యక్తులు ప్రధానమంత్రి కి, సిబిఐ కి మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పైన లేఖలు మరియు ఇమెయిల్స్  రాయాలి,” అని వీర శంకర్ అన్నారు.

“ఒక యాక్టర్ గా కాకుండా ఒక డాక్టర్ గా తోటి డాక్టర్ కు జరిగిన ఈ ఘోరాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి నరరూప రాక్షసులని ఎంత త్వరగా శిక్షిస్తే అంత మంచిది. మిగితా వారు ఇలాంటి నేరాలు చేయాలి అన్నప్పుడల్లా భయపడాలి. మా అసోసియేషన్ లో సభ్యులైన మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ‘విమెన్ సెక్యూరిటీ సెల్’ స్థాపించడం జరిగింది. ప్రతి సభ్యురాలి కి ఆ సెల్ ఇమెయిల్ మరియు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మా మహిళలు ఆ సెల్ ని సంప్రదించి వారి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. వారి వివరాలు గోప్యాంగా ఉంచబడుతాయి. మహిళలందరూ ప్రస్తుతం ఉన్న టెక్నాలాజీ ని, పోలీస్ వారి షి-టీం యాప్ లను ఉపయోగించాలని మనవి చేస్తున్నాను,” అని మా ఉపాధ్యక్షులు మాదాల రవి అన్నారు.

“ఇలాంటి సంఘటన లు ఉహించుకోవాలంటేనే ఒళ్ళు గగ్గురూపుడుస్తుంది. ప్రతిసారి మహిళలపై ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజం కొన్ని రోజులు ఖండించి మర్చిపోతుంది. సమస్య మహిళల భద్రత కాదు. మనం మహిళలకు మరియు పురుషులకు ఒక భద్రతాయుతమైన సమాజనాన్ని నిర్మించాలి. కానీ మహిళల వస్త్రధారణ, వారి లైఫ్ స్టైల్ వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అని మనం ఆరోపించడం ఆపనంతవరకు అలంటి మెరుగైన సమాజం నిర్మించలేము. కావున మనమందరం మహిళల పై అసభ్యకర మాటలు, చర్యలు ఆపేసి మెరుగైన సమాజాన్ని నిర్మించాలి,” అని నటి కామాక్షి అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ సుప్రియ మాట్లాడుతూ, “ఈ ఈవెంట్ కి నాకు చాలా మంది సహకరించారు. జీవిత గారు, కామాక్షి గారు, దామోదర్ ప్రసాద్ గారు అందరికీ థాంక్స్ చెప్తున్నాను. నా దృష్టిలో ఇది మనం చేయగలిగిన చాలా చిన్న పని. కానీ అందరూ వచ్చినందుకు తాంక్స్” అన్నారు.

Telugu Film Industry against Kolkata rape & murder
Telugu Film Industry against Kolkata rape & murder

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here