-‘శ్వాగ్’ కంటెంట్ డ్రివెన్ వెరైటీ మూవీ: నిర్మాత టిజి విశ్వ ప్రసాద్

0
73
SWAG Teaser -Sree Vishnu , T G Vishwa Prasad , Hasith Goli
SWAG Teaser -Sree Vishnu , T G Vishwa Prasad , Hasith Goli
శ్రీ విష్ణు, హసిత్ గోలి, TG విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘శ్వాగ్’ క్రేజీ & ఫన్-ఫిల్డ్ టీజర్ లాంచ్
కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ ‘రాజ రాజ చోరా’ తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్ గా ‘శ్వాగ్’ తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
శతాబ్దాల క్రితం పురుషుల ఉనికికే ముప్పు పొంచి ఉన్న కాలంలో, వింజమర వంశానికి చెందిన రాణి రుక్మిణీ దేవి పురుషులపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకుంది, తనకు ఒక కొడుకు పుడితే చంపడానికి కూడా వెనుకాడదు. అయితే రాజవంశంపై ఒక శాపం చివరికి పరిస్థితిని రివర్స్ చేస్తుంది. ఇది క్రమంగా మార్పుకు దారితీస్తుంది. అక్కడ పురుషులు స్త్రీలపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు.
శ్రీవిష్ణు, హసిత్ గోలీ కాంబినేషన్‌లో ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ గా ఉంటుంది. ఈసారి, వారు యూనిక్ బ్యాక్ డ్రాప్ లో బలమైన కథతో ఎంటర్ టైన్ చేయబోతున్నారు. ఇండియన్ సినిమాలో ఇంతకు ముందు టచ్ చేయని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి, అవి నెక్స్ట్ ప్రమోషనల్ మెటీరియల్‌లో రివిల్ అవుతాయి.
శ్రీ విష్ణు…కింగ్, భవభూతి, సింగ, యయాతి వంటి విభిన్నమైన పాత్రలలో అద్భుతంగా అలరించారు. క్వీన్ రుక్మిణీ దేవిగా రీతూ వర్మ మెప్పించింది. టీజర్‌లో మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్ వంటి ఇతర పాత్రలు కూడా కీలకంగా ఉన్నాయి.
వేదరామన్ శంకరన్ కెమెరా పనితనం ఇంపాక్ట్ పుల్ గా ఉంది, వివేక్ సాగర్ ఆకట్టుకునే స్కోర్‌తో ప్రతి ఎలిమెంట్‌ను ఎలివేట్ చేశాడు. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని నిర్వహిస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. క్రేజీ అండ్ ఫన్ ఫుల్ టీజర్ విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచింది.
 హీరో శ్రీవిష్ణు.. మగ మహారాజులకు, మకుటం లేని మహారాణులకు స్వాగనిక వంశానికి స్వాగతం. టీజర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. ఇలాంటి కథ నాకు ఇచ్చిన హసిత్ చాలా థాంక్స్. చాలా గొప్ప కథ. ఇండియన్ స్క్రీన్ లో ఇప్పటివరకూ రాలేదు. ఇది మనఅందరి ఇళ్ళలో వున్న పాయింట్ అయినా స్క్రీన్ పైకి ఇప్పటివరకూ రాలేదు. ఇలాంటి కంటెంట్ ని సినిమా చేయడానికి ముందుకువచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి థాంక్ యూ. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా దమ్ముండాలి. టీంలో అందరికీ థాంక్ యూ. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం.’అన్నారు. 
నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ .. శ్రీవిష్ణు, హసిత్ తో కలసి రాజ రాజ చోర సినిమా చేశాం. ఇది మా సెకండ్ మూవీ. ఇది కంటెంట్ డ్రివెన్ వెరైటీ మూవీ. కమల్ హసన్ గారి ఇంద్రుడు చంద్రుడు లాంటి సినిమాలు చూసిన ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. ఒక మంచి వెరైటీ కంటెంట్ ని ఇస్తున్నామని అనుకుంటున్నాం’ అన్నారు 

SWAG Teaser English Article >>> Read Here

డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ తో కొంత అర్ధమైవుంటుంది. జనరేషన్ గా వస్తున్న జెండర్ వార్ టచ్ చేసి వుంది. టీజర్ లో కొంచమే చెప్పాం. ఇది అచ్చ తెలుగు సినిమా. కంటెంట్ చాలా మాట్లాడుతుంది. ఇండియన్ కంటెంట్ లో ఇప్పటివరకూ రాలేదు. తాతలు ముత్తతలతో పాటు చూడగలిగే సినిమా. విష్ణు గారు గ్రేట్ పెర్ఫార్మార్. అన్ని క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఇలాంటి యూనిక్ కంటెంట్ కి సపోర్ట్ చేసిన విశ్వగారికి చాలా థాంక్ యూ’ అన్నారు.    
సినిమాటోగ్రాఫర్ వేదరామన్ శంకరన్ మాట్లాడుతూ.. హలో ఆల్. వెల్ కం టూ వరల్డ్ అఫ్ శ్వాగ్. ఎంజాయ్’ అన్నారు 
ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ.. టీజర్ చిన్న పార్ట్.. మూవీలో దీనికి వందరెట్లు చూస్తారు. ఒకొక్క క్యారెక్టర్ ఒకొక్క ప్రపంచం. చాలా ఎంజాయ్ చేస్తారు’అన్నారు
నటీనటులు
శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ
Watch Swag Teaser Click Here >>>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here