ఆకట్టుకుంటోన్న సుహాస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ ‘జనక అయితే గనక’ ట్రైలర్.. సెప్టెంబర్ 7 మూవీ గ్రాండ్ రిలీజ్
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ట్రైలర్‌ను గమనిస్తే.. సుహాస్‌కు పెళ్లైనప్పటికీ పిల్లలు వద్దని అనుకుంటూ ఉంటాడు. అందుకు కారణం.. ఖర్చులు పెరిగిపోతాయని అతని భయం. భార్యకు ఏం చెప్పి మెనేజ్ చేస్తున్నాడనేది ఎవరికీ అర్థం కాదు. అతని కుటుంబ సభ్యులందరూ పిల్లలు కనమని ఎంత బలవంతం చేసినా అందరికీ సర్ది చెప్పేస్తుంటాడనే విషయాలను కామెడీ సన్నివేశాలతో చూపించారు. ఇలాంటి మనస్తత్వమున్న హీరోకి తన భార్య గర్భవతి అని తెలిసినప్పుడు ఏం చేస్తాడు.. మధ్య తరగతి వ్యక్తి అయిన హీరో ఎవరిపై కేసు వేస్తాడు.. ఎందుకు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు.
బలగం వంటి సెన్సేషన్ బ్లాక్ బస్టర్ సాధించి దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో వస్తోన్న సినిమా ఇది. బలగం సినిమా కంటెంట్‌పై దిల్ రాజు ఎంత నమ్మకంగా ఉన్నారో.. అంతే నమ్మకంతో ‘జనక అయితే గనక’ సినిమాపై నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, నా ఫేవరేట్ నా పెళ్లాం సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది.
దిల్ రాజు
‘‘మధ్య తరగతి తండ్రికి ఉండే కష్టాలను అందరం చూసే ఉంటాం. ప్రతీ ఇంట్లో ఉండేదే. డైరెక్టర్ సందీప్ తన రియల్ లైఫ్‌లో చూసిన ఇన్సిడెన్స్‌ను బేస్ చేసుకుని కథను తయారు చేశారు. దీన్ని హ్యుమరస్‌గా, మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేశారు. సినిమా చూశాను. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమాను మీరు చూడబోతున్నారనే నమ్మకంతో ఉన్నాం. సెప్టెంబర్ 7న సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. కావాల్సినంత హ్యుమర్ ఉంటుంది. నాన్ స్టాప్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. సుహాస్, సంగీర్తన జంట ఆన్ స్క్రీన్ చక్కగా ఉంటుంది. సెప్టెంబర్ 7న ‘జనక అయితే గనక’ సినిమాతో మీ అందరి ముందుకొస్తున్నాం’’ అన్నారు.
నటీనటులు
సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్: దిల్‌రాజు ప్రొడక్షన్స్, సమర్పణ: శిరీష్, నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, రచన – దర్శకత్వం: సందీప్ బండ్ల, సంగీతం: విజయ్ బుల్గానిన్, డీఓపీ: సాయి శ్రీరామ్, ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్, ప్రొడక్షన్ డిజైనర్: అరసవిల్లి రామ్‌కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్: భరత్ గాంధీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అకుల్, పీఆర్‌ఓ: వంశీకాకా.
Watch Janaka Aithe Ganaka – Trailer Here >>>