ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. కొత్తదనంతో కూడిన న్యూ ఏజ్ సినిమాలకు వాళ్లు పట్టం కడుతున్నారు. అందుకే దర్శకులు కూడా వారి పల్స్‌ను పట్టుకుని విభిన్నమైన కథలతో, వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా అదే కోవలో మరో విభిన్నమైన ఎంటర్‌టైనర్ రాబోతుంది. రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ది బర్త్‌డే బాయ్. బొమ్మ బొరుసా పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కి దర్శకుడు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకుడు మోహర్ రమేష్ విడుదల చేశారు. టీవీలో స్నేహితులు బాలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓపెన్ అయిన టీజర్, ఆ తరువాత పలు ఎంటర్‌టైనింగ్ సన్నివేశాలతో కొనసాగుతుంది. టీజర్ చూస్తుంటే కొత్తదనంతో కూడిన సినిమాలా అనిపిస్తుంది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చూడాలనే ఉత్సుకతను కలిగించేలా టీజర్ కట్ వుంది. ఈ సందర్భంగా
దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్రతి పాత్ర ఎంటర్‌టైన్ చేస్తుంది. ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం కొత్తగా వుంటుంది.
https://www.youtube.com/watch?v=pRYwxZUFSnQ&pp=ygUXdGhlIGJpcnRoZGF5IGJveSB0ZWFzZXI%3D
ఎం.ఎస్ చదవడానికి విదేశాలకు వెళ్లినప్పుడు ఐదుగురు చిన్ననాటి స్నేహితులకు జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఐదుగురు స్నేహితులకు ఎదురైన అనుభవాలు, వాటి పర్యవసానాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి.
ఈ సినిమా సహజత్వం కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వుండబోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నించాం. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. ఈ నెల 19న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం* అన్నారు.
రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల, ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్, వెంకటేష్, సాయి అరుణ్, రాహుల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఐ.భరత్,
డీఓపీ : సంకీర్త్ రాహుల్, సంగీతం: ప్రశాంత్ శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఆర్ వంశీ.జి, ఎడిటర్: నరేష్ ఆడుపా, సింక్ సౌండ్ డిజైన్:
సాయి మణిధర్ రెడ్డి, సౌండ్ మిక్సింగ్: అరవింద్ మీనన్, మేకప్ చీఫ్:
వెంకట్ రెడ్డి, డిజిటల్ మార్కెటింగ్: ఫస్ట్ షో, పీఆర్ ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు