కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం.. OMG (ఓ మంచి ఘోస్ట్) – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్

0
32

వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవిన్ నేని, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్). మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

*దర్శకుడు శంకర్ మార్తాండ్ మాట్లాడుతూ..* ‘ఈ మూవీ స్క్రిప్ట్స్, డైలాగ్స్‌‌లో సహాయం చేసిన నా డైరెక్షన్ టీంకి, మత్తు వదలరా డైరెక్టర్ రితేష్ రానా గారికి థాంక్స్. మా నిర్మాత ఫాదర్ రాధాకృష్ణ గారికి థాంక్స్. అనూప్ రూబెన్స్ గారి వల్లే ఈ సినిమా ప్రారంభం అయింది. మా మీదున్న నమ్మకంతో అబినికా ఈ సినిమాను నిర్మించారు. సెట్స్ మీద మేం ఏం అడిగినా ఇచ్చారు. అలాంటి నిర్మాతలు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి. అనూప్ గారు ఆర్ఆర్ ఇచ్చిన తరువాత సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. మా ఆర్టిస్టులంతా కూడా అద్భుతంగా నటించారు. ఆండ్రూ గారి కెమెరా వర్క్ బాగుంటుంది. ఫైట్ మాస్టర్ గారు తక్కువ టైంలోనే మాకు కావల్సిన అవుట్ పుట్ ఇచ్చారు. ఆర్ట్ వర్క్ కూడా బాగుంటుంది. మా సినిమాను రిలీజ్ చేస్తున్న ఏసియన్ ఫిల్మ్స్, బాలాజీ ఫిల్మ్స్‌కి థాంక్స్. మా చిత్రం జూన్ 21న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

*నిర్మాత డా.అబినికా ఇనాబతుని మాట్లాడుతూ..* ‘నిర్మాతగా ఇది మాకు మొదటి చిత్రం. శంకర్ గారు ఎంత బాగా కథ చెప్పారో.. అంతకు మించి అనేలా సినిమాను తీశారు. అందరూ చూడదగ్గ చిత్రమిది. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి’ అని అన్నారు.

*అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ..* ‘ముందుగా ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తుండటం ఆనందంగా ఉంది. కరోనా టైంలో శంకర్ నాకు ఈ కథను చెప్పారు. అప్పుడు చిన్నగా అనుకున్నారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సినిమా అద్భుతంగా వచ్చింది. వెన్నెల కిషోర్, నందిత, షకలక శంకర్ మధ్య సీన్లు బాగా వచ్చాయి. హారర్, కామెడీ మిక్స్ చేసి బాగా తీశారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

*నందితా శ్వేత మాట్లాడుతూ..* ‘నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. శంకర్ గారు నాకు ఈ కథను చెప్పినప్పటి నుంచి షూటింగ్ కోసం ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నాను. స్టోరీ నెరేట్ చేస్తూ ఉంటే నవ్వుతూనే ఉన్నాను. హారర్, కామెడీ జానర్లతో రాబోతున్న ఈ మూవీని కుటుంబ సమేతంగా చూడొచ్చు. అందర్నీ నవ్వించేలా మా సినిమా ఉంటుంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఓ మంచి ఘోస్ట్ సినిమా షూటింగ్‌ను మేం అంతా సరదాగా చేశాం. ఈ మూవీ అవుట్ పుట్ కూడా అలానే వచ్చింది. అందరికీ నచ్చేలానే ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు.

*నవమి గాయక్ మాట్లాడుతూ..* ‘నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఆండ్రూ సర్ మా అందరినీ బాగా చూపించారు. అనూప్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీం అందరితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నందిత గారు నాకెంతో సపోర్ట్ ఇచ్చారు. మా చిత్రం జూన్ 21న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

*నటుడు నవీన్ నేని మాట్లాడుతూ..* ‘నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్. సెట్స్‌లో అల్లరి చేస్తూ షూటింగ్ చేశాం. ఎంతో సరదాగా సినిమా షూటింగ్‌ను చేశాం. మూవీ ఎంతో బాగా వచ్చింది. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు.

*రజత్ రాఘవ్ మాట్లాడుతూ..* ‘ఇంత మంచి టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. మా కెమెరామెన్ ఆండ్రూ గారు అద్భుతంగా తీశారు. సుబ్బు గారి ఫైట్స్, అనూప్ గారి ఆర్ఆర్ అదిరిపోతుంది. వెన్నెల కిషోర్, నందిత, షకలక శంకర్, నవీన్ ఇలా అందరితో నటించడం ఆనందంగా ఉంది. ఎంత నవ్వుతారో అంతగా భయపడతారు. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here