హీరోయిన్ చాందిని చైదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవమ్. ప్రకాష్ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు.
ఈ సినిమా ట్రైలర్ ని డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా.
చాందిని చౌదరి మాట్లాడుతూ: ముందుగా మీడియా కి థాంక్స్, ట్రైలర్ చూపించగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు చాలా excite అయ్యి లాంచ్ చేసినందుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, ‘యేవమ్’ అనేది మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా. జూన్ 14న రిలీజ్ అవుతుంది. నేను మొదటి సారి పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాను, సైకలాజికల్ ఎమోషన్స్ చాలా ఉంటాయి. ఏ సినిమా అయినా ప్రేక్షకులు చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ ప్రీడిక్ట్ చేస్తారు. కాని ఈ సినిమాలో వాళ్ళు ఏం అనుకున్నా దానికి పూర్తి బిన్నంగా అవుతుంది. అవ్వన్నీ ప్రేక్షకులకి చాలా హై ఇస్తాయి, కథ వికారాబాద్ లో జరుగుతుంది, తెలంగాణ కల్చర్ కి సంబంధించిన ఎలెమెంట్స్ కూడా ఉంటాయి.
డైరెక్టర్ ప్రకాష్ దంతులూరి మాట్లాడుతూ: ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి క్యారెక్టర్ పోస్టర్స్ ని రిలీజ్ చేశాం, ప్రతి క్యారెక్టర్ కి ఒక్కో ట్యాగ్ లైన్ క్యారెక్టర్ కి సరిపడా ఇచ్చాం, ఈ 4 విభిన్నమైన క్యారెక్టర్స్ , వారి వ్యక్తిత్వాలు ఒక అనుకోని పరిస్థితిలో కలుసుకుని అక్కడి నుండి ప్రయాణం మొదలు పెడితే ఎమవుతుంది అనే థ్రిల్లింగ్ పాయింట్ తో నడిచే కథ. నర్రేషన్ చాలా యునిక్ గా ఉంటుంది. చాలా మంది అడిగారు ఈ కథ పేరు ‘యేవమ్’ అంటే ఏంటి? ఇది తెలుగా? హిందీ ఆ? సంస్కృతమా అని. ‘యేవమ్’ అంటే “ఇది ఇలాజరిగింది” అని. ఈ నాలుగు క్యారెక్టర్స్ జర్నీ లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. ఏది మంచి ఏదో చెడు? ఎవరు మంచి ఎవరు చెడ్డ? అనే నోటుని మేము ప్రేక్షకులకే క్లైమాక్స్ అప్పుడు వదిలేస్తున్నాం. జూన్ 14న రిలీజ్ అవుతుంది.
హీరో భరత్ రాజ్ మాట్లాడుతూ: నేను అభిరామ్ అనే పాత్ర పోషించాను. మా ట్రైలర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి చాలా థాంక్స్. మాది థ్రిల్లర్ కాబట్టి ఏ చిన్న విషయం భయటకి చెప్పినా కూడా కథ తెలిసే ఛాన్స్ ఉంది, అందుకని నేను ఏం చెప్పలేను ఇప్పుడు. కాని చాలా ఈ థ్రిల్లర్ లో చాలా హై వస్తుంది, ఇంటెలిజెంట్ గా ఉంటుంది, మా రొలెస్ తో మీరు తెలియకుండా ఇంటరాక్ట్ అవుతారు. అఅన్నారు.