న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ వార్షికోత్సవం కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది

0
55

న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ వార్షికోత్సవం కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రుషిక తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ యానివర్సరీ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరిపారు. హీరో శ్రీకాంత్ ఇక్కడ సేవలు పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో

న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ వి .వి రుషిక గారు మాట్లాడుతూ – న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ యానివర్సరీ సందర్బంగా మా స్టాఫ్ అందరితో 5కే రన్ నిర్వహించాం. ఈ రోజు మా సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు హీరో శ్రీకాంత్ గారు రావడం సంతోషంగా ఉంది. రీహాబిలిటేషన్ అంటే సాధారణంగా అందరూ స్మోకింగ్, డ్రింకింగ్ కోసం అనుకుంటారు. కానీ మా సెంటర్ లో స్పైన్ ఇంజూరీ, లెగ్ ఇంజూరీ, పెరాలసిస్ వల్ల మంచానికే పరిమితమైన వారికి ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సేవలు అందిస్తున్నాం. నెలల పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా మేము మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ను చూసుకుంటాం. డైపర్ ఛేంజింగ్, ఫుడ్ ఫీడింగ్, వెట్ వైప్స్ తో బాడీ క్లీనింగ్ వంటివి చేస్తాం. ఒకప్పుడు మనం ఇంట్లో పెద్దవాళ్లకు పెరాలసిస్ వస్తే కుటుంబ సభ్యులే అన్ని సేవలు చేసేవారు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అలా చేయడం ఫ్యామిలీ మెంబర్స్ కు సాధ్యం కావడం లేదు. అలాంటి వారికి మా సెంటర్ లో సేవలు అందిస్తున్నాం. ముందు పేషెంట్ కు కౌన్సిలింగ్ చేసి చేర్పించుకుని వీలైనంత త్వరగా వారిని కోలుకునేలా చేసి ఇంటికి పంపిస్తాం. మా సెంటర్ ప్రారంభించి నాలుగేళ్లవుతోంది. ఎంతో కాంపిటేషన్ ఉన్నా నా స్టాఫ్, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ వల్ల సక్సెస్ ఫుల్ గా సెంటర్ ను నిర్వహిస్తున్నాం. త్వరలో సికింద్రాబాద్ లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. హీరో శ్రీకాంత్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అన్నారు

టీఎఫ్ పీసీ సెక్రటరీ టి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ – న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ వారు గత నాలుగేళ్లుగా బెడెడ్ పేషెంట్స్ కు గొప్ప సేవలు అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారికి మంచి నర్సింగ్ సేవలు ఇస్తున్నారు. పసి పిల్లల్లా తమ పేషెంట్స్ ను చూసుకోవడం వల్లే ఈ సెంటర్ కు మంచి పేరు వచ్చింది. న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ వారు ఇక్కడికి వచ్చే వారికి మరింతగా సేవ చేయాలని కోరుకుంటున్నా.అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ – న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. రుషిక గారు ఈ సెంటర్ ను ఎంతో డెడికేటెడ్ గా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. పెరాలసిస్ వచ్చిన వారు, రోడ్ యాక్సిడెంట్ లో బెడ్ కు పరమితమైన వారిని చిన్న పిల్లల్లా చూసుకుంటున్నారు. నాకు ఈ సెంటర్ స్టాఫ్ ను చూస్తుంటే దేవతల్లా అనిపించారు. అంత గొప్ప సేవలు తక్కువ ధరల్లో అందిస్తున్నారు. రుషిక గారి ఆధ్వర్యంలో ఇదే అంకితభావంతో న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ సేవలు అందించాలని కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చే వారందరికీ మంచి జరగాలి. అన్నారు.
న్యూ లైఫ్ ఫీజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతూ వి .వి రుషిక గారు కోవిడ్ ఫస్ట్ వేవ్ లో కూడా చాలా సేవలు చేసారు అని కొనియాడారు . కోవిడ్ ఫస్ట్ వేవ్ లో కూడా దాదాపు 100 -150 మందికి ఉచితంగా కోవిడ్ టీకాలను పద్మజ హాస్పిటల్ నుంచి వేయించారు అని పేర్కొన్నారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ లో టీకా ఉచితంగా వెయ్యడం అంటే మాములు విషయం కాదని అయన అన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ పై మక్కువ తో ఆమె
ఒక డైరెక్టర్ గా ఉంటూ అలాగే ఈ హాస్పిటల్ లో కూడా బిజీగా ఉండడం చాల మంచిది. పద్మజ గారు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని శ్రీకాంత్ గారు అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here