ఘనంగా విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ “తుఫాన్” టీజర్ లాంఛ్

0
78

వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ కు దగ్గరైన హీరో విజయ్ ఆంటోనీ తుఫాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గా ఆయన లవ్ గురు సినిమా తెలుగులో మంచి సక్సెస్ సాధించింది. తుఫాన్ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో తుఫాన్ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. ప్రస్తుతం తుఫాన్ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఓ దీవి నేపథ్యంగా సాగే ఈ సినిమా షూటింగ్ ను అండమాన్, డయ్యూ డమన్ లలో జరిపారు. జూన్ లో ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. తాజాగా “తుఫాన్” సినిమా టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – నేను ఈ ఈవెంట్ కు రావడానికి నిర్మాత ధనుంజయన్ గారు కారణం. విజయ్ ఆంటోనీ గారిని వారి ఇంట్లో కలిసే అవకాశం నాకు దక్కింది. బిచ్చగాడు 2 సినిమా కోసం ఆయన చేసిన వర్క్ గురించి నాకు చెప్పారు. నేను సర్ ప్రైజ్ అయ్యాను. విజయ్ ఆంటోనీ గారు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో. ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నారు. ఈ సినిమాలో ఇద్దరు విజయ్ లు ఉన్నారు విజయ్ మిల్టన్, విజయ్ ఆంటోనీ. ఇద్దరు విజయ్ లు ఉంటే విజయం తప్పకుండా అందుతుంది. తుఫాన్ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

రచయిత భాష్యశ్రీ మాట్లాడుతూ – “తుఫాన్” మూవీతో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేశారు విజయ్ ఆంటోనీ గారు. తుఫాన్ లాంటి కలెక్షన్స్ ఈ మూవీకి వస్తాయని నమ్ముతున్నా. మా డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు తన కెరీర్ లో చేసిన స్టైలిష్ మూవీ ఇదే. విజయ్ ఆంటోనీ గారి పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు అచ్చు రాజమణితో కలిసి విజయ్ ఆంటోనీ మ్యూజిక్ చేశారు. నేను పాటలు, మాటలు రాశాను. చాలా మంది పేరున్న ఆర్టిస్టులు “తుఫాన్” సినిమాలో ఉన్నారు. ఈ సినిమా స్ట్రైట్ తెలుగు మూవీ అనిపించేలా రూపొందించాం. తప్పకుండా హిట్ అవుతుంది. అన్నారు.

నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ – “తుఫాన్” మూవీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాత్రమే కాదు ఇందులో ఎమోషన్, రిలేషన్ షిప్ తో పాటు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు కొత్త ఎక్సీపిరియన్స్ ఇవ్వాలంటే కొత్త లొకేషన్ లో మూవీ చేయాలని మా డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు అండమాన్, డయ్యూ డామన్ వంటి ప్లేసెస్ లో షూటింగ్ జరిపారు. “తుఫాన్” లో భారీ కాస్టింగ్ ఉంది. వాళ్లంతా మంచి రోల్స్ చేశారు. విజయ్ ఆంటోనీ గారి లవ్ గురు సినిమా ఓటీటీలో పది లక్షల మంది చూశారు. “తుఫాన్” సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

డైరెక్టర్ విజయ్ మిల్టన్ మాట్లాడుతూ – తమిళ్ లో తెలుగు హీరోలకు, దర్శకులకు మంచి క్రేజ్ ఉంది. వారిని బాగా అభిమానిస్తారు. తెలుగు ఆడియెన్స్ అంటే నాకు అభిమానం. తెలుగులో ఒక సూపర్ హిట్ సినిమా రూపొందించాలనేది నా కల. వాళ్లు సినిమాను సెలబ్రేట్ చేసుకునే విధానం ఆకట్టుకుంటుంది. విజయ్ ఆంటోనీతో నాకు ఇరవై ఏళ్ల స్నేహం ఉంది. ఇంతకాలం నాతో ట్రావెల్ చేస్తున్నందుకు విజయ్ కు థ్యాంక్స్. “తుఫాన్” సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడ్డాం. ఒక దీవిలో జరిగే కథ ఇది. ఒక అపరిచిత వ్యక్తి అపరిచిత సమాజంలోకి అడుగుపెట్టాక మొదలయ్యే స్టోరీ ఇది. అండమాన్ లో షూటింగ్ చేయాలని ప్లాన్ చేశాం. అక్కడ షూటింగ్ మేము అనుకున్నట్లు సాధ్యం కాలేదు. డామన్ అండ్ డయ్యూ, గోవాలో షూటింగ్ చేశాం. తుఫాన్ వచ్చే ముందు ఎలా ప్రశాంతంగా ఉంటుందో కథలో హీరో క్యారెక్టర్ అలా ఉంటుంది. ఈ టైటిల్ సజెస్ట్ చేసిన భాష్యశ్రీ గారికి థ్యాంక్స్. బిగ్ కాస్ట్ తో మీ ముందుకు వస్తున్నాం. “తుఫాన్” సినిమా మేకింగ్ లో నాకు సపోర్ట్ చేసిన మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – “తుఫాన్” యాక్షన్ ప్యాక్డ్ మూవీ. అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చుతుంది. మా ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. మా డైరెక్టర్ విజయ్ మిల్టన్ సినిమాటోగ్రాఫర్ గా చాలా సినిమాలు చేశారు. తెలుగులో వచ్చిన ప్రేమిస్తే చిత్రానికి ఆయనే సినిమాటోగ్రాఫర్. విజయ్ తో కలిసి పనిచేయడ హ్యాపీగా ఉంది. భాష్యశ్రీ నాతో కంటిన్యూగా ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమా ఆయనకు కూడా మంచి పేరు తెస్తుంది. నిర్మాత వంశీ నందిపాటి నాతో బిచ్చగాడు 2 సినిమాకు అసోసియేట్ కాబోతున్నాడు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్. సత్యరాజ్, శరత్ కుమార్, డాలీ ధనుంజయ వంటి చాలా మంది పేరున్న కాస్టింగ్ తో “తుఫాన్” మూవీ మీ ముందుకు రాబోతోంది. జూన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా. నేను ఇటీవల రివ్యూయర్స్ గురించి మాట్లాడిన మాటలు అందరినీ ఉద్దేశించి కాదు. సినిమా మా బేబి. మీ బేబిని ఎవరైనా తిడితే మీకు కోపం వచ్చినట్లే మేము కష్టపడి చేసిన సినిమాను విమర్శిస్తే కోపం వస్తుంది. ఒకరిద్దరు బ్యాడ్ ఇంటెన్షన్ తో ఇచ్చిన రివ్యూల వల్ల మా సినిమా కిల్ అవుతుందని చెప్పాం. అది పర్సనల్ గా జరిగిన అటాక్. సినిమా గురించి రివ్యూ చెప్పే రైట్ మీడియాకు ఉంది. ఆ స్వేచ్ఛను గౌరవిస్తాను. తెలుగులో ఇటీవల థియేట్రికల్ గా కొన్ని మూవీస్ ఆదరణ పొందలేదు. కానీ హనుమాన్, టిల్లు స్క్వేర్ సినిమాలు మంచి బాక్సాఫీస్ వసూళ్లను సాధించాయి. కంటెంట్ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారు. అన్నారు.

నటీనటులు – విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ – షిమోనా స్టాలిన్
డిజైనర్ – తండోరా చంద్రు
యాక్షన్ కొరియోగ్రాఫర్ – సుప్రీమ్ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ – అరుముగస్వామి
ఎడిటింగ్ – ప్రవీణ్ కేఎల్
మ్యూజిక్ – అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ
డైలాగ్ రైటర్ – భాష్య శ్రీ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాతలు – కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా
రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ – విజయ్ మిల్టన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here