ఎందరో మహానుభావులు కాని కొందరే చరిత్రలో చరిత్రగా నిత్యం ప్రేక్షకుల మదిలో కదలాడుతారు.
వారి ప్రతి అడుగు, ప్రతి మాట, వారి ప్రతి చిత్రం, ప్రతిపాట అభిమానుల మనసులోతులు తాకి మనసులను పరవశులను చేస్తాయి.
ఆ ఒక్కరే ద గ్రేట్ కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారి వంటి నటులు ప్రపంచ చలన చిత్ర రంగంలో ఎక్కడా కనిపించరు. మొదటి అడుగునుండి సంచలనమే
ఎన్నో ఎన్నెన్నో విజయాలు
కొన్ని అయితే ఎవరూ చేయలేని చిత్రాలు
కొన్ని అయితే ఎవరూ సాధించలేని చిత్రాలు
కొన్ని పాత్రలు ఎవరూ నటించలేని చిత్రాలు
కొన్ని చిత్రాలు చరిత్రను తిరగరాసేవి
తెలుగు సినిమా రంగాన్ని పరుగులెత్తించి అలసట ఎరుగని ధీరునిగా 360 చిత్రాలు నటించి, జీవించి, అభిమానులను వారి మనసులను గెలుసుకుని సూపర్ స్టార్ గా స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
వ్యక్తిగతంగా తనకెదురయిన ప్రతి ఒక్కరి అవసరాలను ఆపదలో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా వారి సమస్యలను తీర్చి వారి అభివృద్ధికి పాలుపడే మంచి మనిషి, మహా మనిషి శ్రీ కృష్ణ గారు
అప్పటికి ఎప్పటికి చెరగని తెలుగువారి పౌరుషాన్ని అల్లూరి సీతారామరాజు గారి చిత్రంలో కృష్ణ గారి నట ఆవిష్కరణ, మరెవ్వరు దరిచేరలేని విశ్వరూప ప్రదర్శన ప్రేక్షకుల మదిలో అల్లరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణగారే వారి రూపమే కళ్ళ ముందు కదలాడుతుంది
ప్రజల పట్ల సమాజం పట్ల ప్రజా సమస్యలపై పోరాటం జరిపే నాయకునిగా పలు చిత్రాలు వారి గొప్పదనాన్ని సూచిస్తుంది. ప్రజల మనసులలో సుస్థిర స్థానం సంపాదించి సింహాసనాధీశుడై జేజేలు అందు కుంటున్న సూపర్ స్టార్ క్రృష్ణ గారు.
కృష్ణగారిని ఆఛిమానించే ప్రతివారికి ప్రతిరోజు ప్రతిక్షణం కృష్ణ గారి జ్ఞాపకాలే దైనందిన కార్యక్రమాలలో వారిస్మరణ మరువరు . రోజులో ఆనేక పర్యాయాలు వారి స్మరణ చేస్తూ వారు నటించిన చిత్రాలు వారి చిత్రాలలోని పాటలు విని ఆనందించి చక్కని జీవితం గడుపుతూ మేము సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానలము అని గర్వంగా చెప్పుకుంటారు. అంతలా ప్రభావితం చేసిన కృష్ణగారు అభిమానులను శోక సముద్రంలో ముంచి దైవం దగ్గరకు వెళ్ళిపోవడం ఎంతగానో బాదిస్తుంది.
ఇటువంటి సమయంలో నేను సూపర్ స్టార్ విగ్రహం నా షాపులో ప్రతిష్టించి రోజులో సుమారు 18 గంటలు నాప్రక్కన ఉండేలా ప్రతిక్షణం వారిని చూసేలా ప్రతిస్టించి వారు లేని లోటు రానివ్వకుండా వారి జ్ఞాపకాలే సంతోషంగా మలచుకుని ఉన్నాను.
6-6-2023 న అభిమానుల మధ్య ప్రతిస్టించి అంతులేని అనందాన్ని పొందగలిగాను . ప్రతి రోజు పుష్పలంకరణ చేస్తాను, వారికి దూపం నైవేద్యం చూపించి దైనందిన కార్యక్రమాలు మొదలు పెడతాను. విగ్రహం మొదలు ప్రతి ఖర్చు స్వంతంగా చేసి వారిపై నా అభిమానాన్ని వ్యక్తపరచడం జరిగింది
ఆకాశంలో ఒక తార నేలజారి ఎందరినో ఆలరించి మురిపించి తిరిగి భువికేగిన నక్షత్రంగా ఎప్పటికి వారు అభిమానులకు కాంతిపుంజ మై కదలాడుతుంటారు.
జోహార్ సూపర్ స్టార్ కృష్ణగారు
ఇట్లు
అభిమాని K.G.K మోహన్
East Godavari
కొవ్వూరు
9866779811