రాజా గౌతమ్, బ్రహ్మానందం తాత మనవళ్ళగా ‘బ్రహ్మా ఆనందం’

0
55

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేయనున్నారు. నిజజీవిత తండ్రీ కొడుకులు తాత, మనవళ్లుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు RVS నిఖిల్ దర్శకత్వం వహించనున్నారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు.

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్100% సక్సెస్ రేట్‌తో న్యూ ఏజ్ కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందిస్తోంది. వారి గత చిత్రాలు మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందించాయి. వారి బ్యానర లో 5వ ప్రొడక్షన్‌గా VIBE చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు. వారి ప్రొడక్షన్ నెంబర్ 4 గా ‘బ్రహ్మ ఆనందం’ ను ఆహ్లాదకరమైన ప్రీ-లుక్ పోస్టర్, వీడియోతో అనౌన్స్ చేశారు.

ప్రీ లుక్ పోస్టర్ పట్టణ, గ్రామీణ సంస్కృతుల సమ్మేళనం. గౌతమ్ తదుపరి చిత్రం గురించి బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణను వీడియో ప్రజెంట్ చేస్తోంది. వెన్నెల కిషోర్, బ్రహ్మానందంకి గౌతమ్ సినిమా చేయడానికి అనుమతి ఇచ్చాడని చెప్పారు. తాత పాత్రలో నటించడానికి  అంగీకరించమని ఇద్దరూ లెజండరీ హాస్యనటుడిని అభ్యర్థించారు. వీడియో సూచించినట్లుగా, బ్రహ్మా ఆనందం హోల్సమ్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. బ్రహ్మీ, గౌతమ్‌ల పాత్రలని బ్రీఫ్ చేసే ఈ హిలేరియస్  వీడియో సినిమాపై ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేసింది.

వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాలోని సాంకేతిక నిపుణులను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. శాండిల్య పిసపాటి సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీని మితేష్ పర్వతనేని అందిస్తున్నారు. ప్రసన్న ఎడిటర్.

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది డిసెంబర్ 6న బ్రహ్మా ఆనందం చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

తారాగణం: రాజా గౌతమ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: RVS నిఖిల్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ: శ్రీమతి. సావిత్రి , శ్రీ ఉమేష్ యాదవ్
డీవోపీ: మితేష్ పర్వతనేని
సంగీతం: శాండిల్య పిసపాటి
ఎడిటర్: ప్రసన్న
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి దయాకర్ రావు
పీఆర్వో: వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: మాయాబజార్
మార్కెటింగ్: ఫస్ట్ షో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here