భయపెడుతున్న ఓ మంచి ఘోస్ట్ (OMG)

0
44

దెయ్యం సినిమా అంటే జనాల్లో ఓ రకమైన ఇంట్రెస్ట్ చూస్తుంటాం. అన్ని వర్గాల ఆడియన్స్ ఘోస్ట్ సినిమాలను ఇష్టపడుతుంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్రర్ మూవీస్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక హార్రర్ సినిమాల్లో కూడా వైవిద్యం చూపిస్తే ఆ మూవీ సూపర్ హిట్ సాధించినట్లే. సరిగ్గా అదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది OMG (ఓ మంచి ఘోస్ట్) మూవీ. హార్రర్ సన్నివేశాలకు హాస్యం జోడించి నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్తగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై హాస్యభరితమైన హార్రర్ సినిమాగా ఓ మంచి ఘోస్ట్ (OMG) రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. డా.అబినికా ఇనాబతుని నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ తెచ్చుకోగా.. తాజాగా వదిలిన గ్లింప్స్, కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. ఓ మంచి ఘోస్ట్ కాన్సెప్ట్ పోస్టర్ లో సినిమా థీమ్ ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రధాన నటులు దెయ్యాన్ని చూడటం, వారి ముఖాల్లో ఏదో తెలియని భయం కనిపిస్తుండటం చూపించి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. ఈ పోస్టర్‌లో దెయ్యం యొక్క నీడ కూడా మనం చూడొచ్చు.

ఇక గ్లింప్స్ వీడియో అయితే మరింత ఆకట్టుకుంటోంది. హాంటెడ్ హౌస్‌ని తలపించే సన్నివేశాలు, దెయ్యం రూపం, భయం కలిగించేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి. భూతవైద్యునిగా షకలక శంకర్, వెన్నెల కిషోర్, మిగిలిన అన్ని ప్రధాన పాత్రలను చూస్తుంటే ఈ సినిమాలో హారర్, థ్రిల్లర్ అంశాలతో పాటు కామెడీ కూడా ఫుల్లుగా ఉంటుందని అర్థమవుతోంది. మొత్తంగా చెప్పాలంటే ఇది నవ్విస్తూనే భయపెట్టే సినిమా అని తెలుస్తోంది. తాజాగా వదిలిన కాన్సెప్ట్ పోస్టర్, గ్లింప్స్ ఖచ్చితంగా సినిమాపై అంచనాలు పెంచాయనే చెప్పుకోవాలి.

వెన్నెల కిషోర్, షకలక శంకర్, రజత్ రాఘవ్, రఘు బాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, షేకింగ్ శేషు, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మొదటి నిమిషం నుంచి చివరి నిమిషం వరకు ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ చిత్రానికి ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఎడిటింగ్ ఎం.ఆర్.వర్మ. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: శంకర్ మార్తాండ్
నిర్మాత: డా.అబినికా ఇనాబతుని
బ్యానర్: మార్క్‌సెట్ నెట్‌వర్క్స్
సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూ
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
ఆర్ట్ డైరెక్టర్: సుప్రియ
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
కొరియోగ్రాఫర్: బాబా భాస్కర్
విజువల్ ఎఫెక్ట్స్: విక్టర్, కళ్యాణ్, విజయ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here