ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇక ప్రస్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ అయినా సన్పేషన్. ఇటీవల ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ టీజర్‌కు వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీజర్ విడుదలైనప్పటి నుండి నాన్‌స్టాప్‌గా 138 గంటల పాటు యూట్యూబ్‌లో ట్రెండింగ్ వన్‌లో వుండి కొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పుష్ప -2 ది రూల్ కొత్త అప్‌డేట్ వచ్చేసింది. యువ సంగీత కెరటం దేవి శ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం పాటల్లోంచి మొదటి లిరికల్ వీడియో సాంగ్‌ను మే 1న ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. దీనికి సంబంధించిన 20 సెకండ్ల ప్రోమోను బుధవారం విడుదల చేశారు మేకర్స్… పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్ అంటూ కొనసాగే ఈ టైటిల్ సాంగ్ ఎంతో పవర్‌ఫుల్‌గా వుండబోతుందని ఈ ప్రొమో చూస్తే తెలుస్తుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2 ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి.
2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
One chant will resonate all over 💥#PushpaPushpa Lyrical Promo out now ❤️🔥
🎶 #Pushpa2FirstSingle firing on May 1st at 11.07 AM 🔥A Rockstar @ThisIsDSP Musical 🎵
Grand release worldwide on 15th AUG 2024 💥💥
Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/kDEN0skVgz— BA Raju's Team (@baraju_SuperHit) April 24, 2024
నటీనటులు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు
టెక్నికల్ టీం: కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్
పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు