చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై సూర్య కిరణ్ , దీయ రాజ్ హీరోహీరోయిన్లుగా ప్రసిద్ దర్శకత్వంలో పి. రాకేష్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందిన సామాజిక ఇతివృత్తాంతం తో రూపొందిన ఎంటర్టైనర్ ” వాలంటీర్ “. ఈ చిత్రం ఇటీవల తిరుపతి లో ఫస్ట్ లుక్ కార్యక్రమం వైభవంగా జరుపుకుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ” ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తర్వాత నేను చేస్తున్న రెండో చిత్రమిది. మా చిత్రంలో ఎమ్ ఎల్ సి దువ్వాడ శ్రీనివాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు.నేటి రాజకీయ పరిస్థితులలో వాలంటీర్ పాత్ర గురించి విశదీకరించే చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో మిగతా వివరాలు తెలియజేస్తాము” అన్నారు.
సూర్య కిరణ్, దీయరాజ్, దువ్వాడ శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అభిషేక్ రూపాస్, కెమెరా : గోపి కాకర్ల,సురేష్, ఎడిటర్ : శశాంక్, ఫైట్స్: పవన్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజ వంశీ, పి అర్ ఓ : బాసింశెట్టి, వీరబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మధు రాజ్,ప్రసిధ్, నిర్మాత : పి. రాకేష్ రెడ్డి, డైరెక్టర్ : ప్రసీద్