యూ ట్యూబ్ రికార్డులు బద్దలు కొడుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప‌-2 ది రూల్ టీజర్

0
86

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక ప్ర‌స్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప‌-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ అయినా స‌న్పేష‌న్‌. ఇటీవ‌ల ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ టీజ‌ర్ విడుద‌లైనప్ప‌టి నుండి అన్యూహ్య స్పంద‌న‌తో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా స‌న్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. అంతేకాదు టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుండి యూట్యూబ్‌లో కంటిన్యూగా 138 గంట‌ల‌పాటు ట్రెండింగ్‌లో నెంబ‌ర్‌వ‌న్‌గా వుంటూ స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది. అంతేకాదు ఇప్ప‌టి వ‌ర‌కు 110 మిలియ‌న్ల వ్యూస్‌తో పాటు, 1.55మిలియ‌న్ల లైక్స్‌తో అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటూ విజ‌య‌ప‌థంలో కొన‌సాగుతుంది. ఇక రాను రాను మ‌రిన్ని రికార్డులు కూడా పుష్ప‌-2 సొంతం కానున్నాయి. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

నటీనటులు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు

టెక్నికల్ టీం: కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్
పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here