భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్

0
114

భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి మరియు కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జే. బాలరాజు, ఏ. గోపాలరావు గార్లు వెంకయ్య నాయుడు గారిని కలిసి అభినందించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ : గతంలో వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గా, ఎంపీ గా మరియు వివిధ శాఖల మంత్రి గా అలాగే మాజీ ఉపరాష్ట్రపతి గా ఎన్నో సేవలు అందించారు. వెంకయ్య నాయుడు గారు చెప్పే విషయాలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఆయన మాటల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషణం రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే సినిమా ఇండస్ట్రీ కి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు అని తెలియ చేశారు.

FNCC సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి గారు మాట్లాడుతూ : ఈ రోజున వెంకయ్య నాయుడు గారి లాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషన్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. తెలుగువారిగా ఉపరాష్ట్రపతి స్థానానికి ఎదిగిన వ్యక్తి. తెలుగు సంప్రదాయ కార్యక్రమాలాకు హాజరవుతూ ప్రోత్సహించడంలో ముందుంటారు. అలాంటి వ్యక్తికి భారతరత్న రావాలని నా అభిప్రాయం అని తెలియజేశారు. మాకు సమయాన్ని కేటాయించినందుకు వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here