కొత్త రంగుల ప్రపంచం మూవీ రివ్యూ

0
125

చిత్రం: కొత్త రంగుల ప్రపంచం

బ్యానర్: శ్రీ పీఆర్ క్రియేషన్స్
నటీనటులు: పృథ్వీరాజ్, క్రాంతి కృష్ణ, శ్రీలు, విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, కృష్ణ తేజ, అంబటి శ్రీను, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ గణపతి తదితరులు
డైరెక్టర్: పృథ్వీరాజ్
నిర్మాత: దాసరి పద్మ రేఖ, కృష్ణా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి
సంగీతం: సంగీత్ ఆదిత్య
సినిమాటోగ్రఫి: S.V శివారెడ్డి
ఎడిటర్: రామకృష్ణ ఎర్రం
విడుదల: 20-01-2024

కామెడీ లో తనదైన ముద్రతో ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన సినిమా ‘కొత్త రంగుల ప్రపంచం’. తన కూతురు శ్రీలు ను వెండితెరకు పరిచయం చేస్తూ శ్రీ పీఆర్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కొత్త రంగుల ప్రపంచం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ఆకట్టుకొడంతో మంచి అంచనాలు ఏర్పడడంతో ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజు థియేటర్లో విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షిద్దాం.

కథ:

పృథ్వీ సినిమా డైరెక్టర్. హీరోయిన్ శ్రీలు, హీరో క్రాంతి కృష్ణ లతో కలిసి సినిమా షూట్ చేయడానికి ఒక ఫామ్ హౌజ్ కి వెళ్తాడు. ఆ ఫామ్ హౌస్ మేనేజర్ గురువయ్య.  శ్రీలు ను చూసి తన కూతుర్ని గుర్తుకు చేసుకుంటాడు. హీరోయిన్ శ్రీలు యాక్టింగ్ చేసినప్పుడు తనను ఎవరో ఆవహించినట్లు వింతగా ప్రవర్తిస్తుంది. మరో వైపు గురువయ్య ఒక గంజాయి స్మగ్లర్ తో డీల్ కుదుర్చుకుంటాడు అడ్డొచ్చిన పోలీసులను హతమారుస్తుంటాడు. ఈ పరిస్థితులను గమనించిన డైరెక్టర్ పృథ్వీ అసలు విషయం కనుకుందామని ఓ గురువు దగ్గరకు వెళ్తే ఆ ఇంట్లో ఓ అమ్మాయి ఆత్మ ఉందని చెప్తుంది. ఆసలు ఆ ఆత్మ ఎవరిది? హీరోయిన్ శ్రీలునే ఎందుకు ఆవహిస్తుంది.? గంజాయి స్మగ్లింగ్ ను పట్టించడానికి క్రాంతి కృష్ణ ఏం చేశాడు? ఇంతకి క్రాంతి కృష్ణ బ్యాగ్రౌండ్ ఏంటి? గురువయ్య శ్రీలును ఎందుకు ప్రేమగా చూసుకుంటున్నాడు? అసలు తలపులమ్మ ఎవరు? తన కోరిక ఏంటీ? ఇన్ని చిక్కుల నడుమ పృథ్వీ సినిమా పూర్తి చేశాడా లేదా అనేది తెలియాలంటే కొత్త రంగుల ప్రపంచం సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

మొదటి చిత్రమే అయినా హీరోయిన్ శ్రీలు ఫార్మార్మెన్స్ ఆకట్టుకుంటుంది. స్క్రీన్ పై సహజంగా కనిపించడమే కాకుండా నటనలో ఈజ్ కనబరిచింది. తలపులమ్మ పాత్రలో చాలా మెచ్యుర్డ్ గా చేసింది. ఇటు మోడర్న్ అమ్మాయిలా కూడా చాలా బాగా చేసింది.  హీరోగా చేసిన క్రాంతి కృష్ణ యాక్టింగ్ పరంగా మంచి మార్కులు వేసుకున్నాడు, తన స్క్రీన్ ప్రజెన్స్ కూడా బాగుంది. యాక్టర్ పృథ్వీ గురించి కొత్తగా చెప్పేదేుం లేదు. ఎప్పటిలాగే అద్భుతంగా చేశారు. తలపులమ్మకు తండ్రి క్యారెక్టర్ చేసిన చౌదరి కూడా చాలా బాగా నటించారు. మిగితా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఇన్నాళ్లు కామెడీ తో అలరించిన పృథ్వీరాజ్ తనలోని దర్శకత్వ ప్రతిభను ఈ చిత్రం తో చూపించారు. ప్రతీ సీన్ చాలా క్లారిటీ తో డిజైన్ చేశారు. చాలా సినిమాలు చేసిన అనుభవం తన డైరెక్షన్ లో కొట్టొచ్చినట్లు కనిపించింది. తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి ఔట్ పుట్ ఇవ్వడం అంటే అది ఆయన అనుభం వల్లనే కావచ్చు. సినిమాటో గ్రాఫర్ ఎస్ వీ శివారెడ్డి చాలా చక్కగా చేశారు. అతనికి పనితనానికి ఎక్కడా వంక పెట్టాల్సిన పనిలేదు. ఎడిటర్ గా రామకృష్ణ ఎర్రం ఇంకాస్త తన కత్తెరకు పని చెప్పుంటే బాగుండేది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఇంకాస్తా పరుగులు పెట్టించల్సింది. మ్యూజిక్ అందించిన సంగీత్ అదిత్య ఆకట్టుకున్నాడు. పాటలు బాగున్నాయి. అలాగే ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సినిమా ఎక్కవ శాతం ఫామ్ హౌస్ లోనే జరుగుతుంది. అయినా పెట్టిన ఖర్చు ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది.

విశ్లేషణ:

సినిమా మొదలవడం ఆసక్తికరమైన థీమ్ తో స్టార్ట్ అవుతుంది. ఎన్నో సార్లు తెలుగు తెరపై వర్కౌట్ అయిన ఫార్మెట్. ఒక ఇంట్లో షూటింగ్ చేయడానికి చిత్ర యూనిట్ వెళ్తుంది. అక్కడ ఒక ఆత్మ ఈ యూనిట్ కు ఎలా చుక్కలు చూపిస్తుంది. ఆద్యాంతం కామెడీతో అలరిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. కొన్ని సీన్లలో ఆలోచింపజేసేలా ఉంటుంది. హీరో మార్నింగ్ షూటింగ్ చేసుకుంటూ, రాత్రిళ్లు దేనికోసమే వెతుకుతూ ఉంటాడు. దాన్ని సెకండ్ ఆఫ్ లో వివరిస్తారు. అలాగే పాటలు కూడా బాగున్నాయి. ఇక తలపులమ్మ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఆ క్యారెక్టర్ ఎవరు అచ్చం హీరోయిన్ లా ఉంటుంది. వీరిద్దరికి ఏదైనా సంబంధం ఉందా అనే అనుమానం కలుగుతుంది. కానీ అసలు ట్విస్ట్ తెలిసినప్పుడు జస్టిఫై అవుతాయి. సెకండ్ ఆఫ్ లో వచ్చే హీరో ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అలాగే గురువయ్య చెప్పె తలపులమ్మ ఫ్లాష్ బ్యాక్ కూడా బాగుంది. కామెడీ కాస్త తగ్గినట్టు అనిపించినా ఎమోషనల్ గా బ్యాలన్స్ చేయడంతో ఫుల్ ప్యాకేజీ ల అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూసి ఎంజాయ్ చెసే సినిమా.

చివరగా: అన్ని అంశాల మేళవింపుతో అలరించే కొత్త రంగుల ప్రపంచం

రేటింగ్: 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here