నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ కు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం  

0
156

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లను అందించిన అభిషేక్ అగర్వాల్‌ .. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబడే కొన్ని ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌లను లైన్ అప్ లో ఉంచారు.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్నారు అభిషేక్ అగర్వాల్‌. ఈ మహత్తర కార్యక్రమానికి ఆహ్వానించబడిన వారిలో మెగా స్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి ప్రముఖులు వున్నారు.

ఈ ఆహ్వానం అందుకోవడం గౌరవంగా వుందని పేర్కొన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. “అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నాను. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి వెళ్లి చరిత్రను తిలకించడం గొప్ప భాగ్యం. నా జీవితం భగవాన్ శ్రీరామునిచే ఆశీర్వదించబడింది, మర్యాద పురుషోత్తముని అపూర్వ ఘట్టాన్ని చూసే అవకాశాన్ని నాకు కల్పించింది” అని ట్వీట్ చేశారు నిర్మాత.

ఇది ప్రతి హిందువు, భారతీయుడు గర్వించదగ్గ సందర్భం.

అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here