ప్రేమ కథ మూవీ రివ్యూ

0
640

చిత్రం: ప్రేమ కథ

విడుదల తేదీ: 05-01-2024

నటీనటులు: కిషోర్ శాంతి దినకరన్, దియా సీతేపల్లి, వినయ్ మహాదేవ్, నేత్ర, పుష్ప ఫేమ్ రాజ్ తిరందాసు

దర్శకుడు : శివ శక్తి రెడ్డి

నిర్మాత: విజయ్ మిట్టపల్లి

సంగీతం: రధన్

సినిమాటోగ్రఫీ: వాసు పెండెం

ఎడిటింగ్: ఆలయం అనీల్

పాటలు, ట్రైలర్ తో లవ్ డ్రామాగా ఆకట్టుకున్న “ప్రేమకథ” నేడు, జనవరి 5న ప్రేక్షకుల ముందుకు థియేటర్ లో విడుదల అయింది. కిషోర్ శాంతి దినకరన్, దియా సీతేపల్లి హీరో హీరోయిన్లుగా శివ శక్తి రెడ్డి దర్శకత్వంలో విజయ్ మిట్టపల్లి నిర్మించిన ప్రేమ కథ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ :

ఆర్ధిక ఇబ్బందుల నడుమ కుటుంబాన్ని పోషించుకోడానికి ప్రేమ్ (కిషోర్ శాంతి దినకరన్) ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పనికి చేరుతాడు. అనుకోని పరిస్థితుల్లో తన ఫ్రెండ్ లవర్ ఫ్రెండ్ అయిన దియా సీతేపల్లిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అక్కడ నుంచి తన ప్రేమ కథ ఎలా నడిచింది? ఆమె అతడి ప్రేమకు ఓకే చెప్పిందా ? చివరికి వారి ప్రేమ గెలిచిందా లేదా? ఆమె కోసం ప్రేమ్ ఏం చేసాడు అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు:

ప్రధాన పాత్రల్లో నటించిన కిషోర్ శాంతి దినకరన్, దియా సీతేపల్లి నటన పరంగా ఆకట్టుకున్నారు.  ప్రేమ్ గా యువ నటుడు కిషోర్ నాచురల్ గా తన పాత్రని క్యారీ చేశారు. దియా కూడా అందంగా కనిపించడంతో పాటు మంచి నటనతో అలరించింది.

ఫ్రెండ్ పాత్రలో నటించిన వినయ్ మహాదేవ్, నేత్ర, పుష్ప ఫేమ్ రాజ్ తిరందాసు తమ పాత్రలకి న్యాయం చేసాడు. వీరితో పాటుగా మిగతా కొందరు నటులు ఓకే అనిపిస్తారు.

విశ్లేషణ:

కథ రెగ్యులర్ లైన్ అయినప్పటికీ దానిని ఎంగేజింగ్ గా చూపించే ప్రయత్నంలో దర్శకుడు విజయవంతమైందనే చెప్పాలి.  2 గంటల 10 నిముషాల నిడివి  సినిమాకి బాగా ఉపయోగపడింది.  దర్శకుడు అనుకున్న పాయింట్ ని కన్విన్సింగ్ గా చెప్పాడు. అక్కడక్కడా సాగదీతగా అనిపించినా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్  గా ఉండడం, హీరో నటన, ఆన్ స్క్రీన్ హీరోయిన్ తో స్క్రీన్ పై కెమిస్ట్రీ బాగుండటం ఈ సినిమాకి అనుకూలాంశాలు.

ఇక దర్శకుడు శివ శక్తి అనుకున్న పాయింట్ ను ఆద్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కించారు . రెగ్యులర్ లైన్ నే ఎంచుకున్నాడు కానీ వాటిలో కొన్ని పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా చెప్పారు. సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. అలాగే సినిమాలో మ్యూజిక్ బాగుంది. రధన్ డీసెంట్ సాంగ్స్ అండ్ స్కోర్ ని అందించాడు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా ఓకే. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండుంటే బాగుండేది. డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. అలాగే కాస్ట్యూమ్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి.

రేటింగ్: 3/5

చివరగా: మెప్పించే భిన్నమైన ప్రేమ కథ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here