చిత్రం: దీనెమ్మ జీవితం
విడుదల తేదీ: 05-01-2024
సెన్సార్ సర్టిఫికేట్: U/A
నిడివి: 2 గం ల 8 ని లు
నటీనటులు: దేవ్ బల్లాని, ప్రియ చౌహాన్, సరిత చౌహాన్, తదితరులు
సినిమాటోగ్రాఫర్: సతీష్ కుమార్ కరే
ఎడిటర్: జాని షేక్
సంగీతం, నిర్మాత, దర్శకత్వం: యల్ల మురళి కృష్ణ
దేవ్ బల్లాని , ప్రియ చౌహాన్, సరిత చౌహాన్ ప్రధాన పాత్రల్లో ‘ప్రేమ పిపాసి’ ఫేం మురళి రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దీనమ్మ జీవితం’. వై.మురళి కృష్ణ, వై.వెంకటలక్ష్మీ, డి.దివ్య సంతోషి, బి.సోనియా నిర్మించారు. రా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ:
క్రిష్ అలియాస్ కృష్ణ (దేవ్ బల్లాని) సినిమా దర్శకుడు అవ్వాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. అతనికి భార్య రాధ (ప్రియా చౌహాన్), ఓ కూతురు ఉంటుంది. అయితే మరో అమ్మయి మహి అలియాస్ మహిమ (సరిత చౌహాన్) తో అక్రమ సంబంధం పెట్టుకావడంతో అతని భార్య రాధ ఎంతో బాధపడుతుంది. తన సంసారాన్ని చక్కదిద్దుకోవాలనుకుంటుంది. అదే సమయంలో మహిమతో సరిపోని క్రిష్ కూడా తనని వదిలించుకుని భార్యతో సంతోషంగా వుండాలనుకుంటాడు. మరి క్రిష్ మహి ని ఎలా వదిలించుకున్నాడు? అందుకోసం ఏమి చేశాడు? అసలు వారి పరిచయం ఎలా జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే అబ్బాయిగా… కెరీర్ లో స్టిరపడాలనుకునే అప్ కమింగ్ డైరెక్టర్ గా దేవ్ విభిన్న కోణాల్లో ఆకట్టుకునేలా నటించాడు. మహి పాత్రలో సరిత చౌహాన్ బోల్డ్ సీన్స్ తో యూత్ ను ఆకట్టుకుంటుంది. గృహిణి పాత్రలో ప్రియా చౌహాన్ కూడా తన పాత్రకి తగ్గ న్యాయం చేసింది. పరాయి అమ్మాయి మోజులో దారి తప్పిన భర్తను ఎలా దారికి తెచ్చుకునే గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
విశ్లేషణ:
సినిమా ఇండస్ట్రీ గురించి… అందులో స్థిరపడాలనుకునే నటీ నటుల పైనా… సాంకేతిక నిపుణుల పైనా ఎలాంటి అభిప్రాయం ఉందో ఇప్పటికే చాలా సినిమాల్లో సెటైరికల్ గా చూశాం. అలాంటి టోన్ లోనే కథ సాగినా, అన్యోన్యంగా ఉండే ఇద్దరు భార్యా భర్తల మధ్య మరో ఆమ్మాయి ఎంటర్ అయితే ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులకు గురవుతుంది… దాని వల్ల కెరీర్ ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది బోల్డ్ గా చూపించారు. తనతో ఎంతో సఖ్యతతో ఉండే భార్యను కాదని ఇకొక అమ్మాయి కి ఆకర్షితుడవడం అనే పాయింట్ ను ఎమోషనల్ గా ఫీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ లో బోల్డ్ రొమాన్స్ తో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసి… సెకండ్ హాఫ్ లో హీరో, హీరోయిన్స్ ఫ్లాష్ బ్యాక్ చూపించి పాత్రలకు జస్టిఫికేషన్ ఇచ్చాడు దర్శకుడు.
గతంలో ప్రేమకోసం తపించే ఓ పిచ్చి ప్రేమికుని కథతో ప్రేమ పిపాసి తీసిన చిత్ర దర్శకుడు మురళి రామస్వామి… ఈసారి మనసుకు నచ్చిన ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయే భర్త… తన ప్రియుడికోసం పరితపించే ఆమ్మాయి మహి పాత్రను నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా చూపించారు. కొన్ని బోల్డ్ సీన్స్ యానిమల్ సినిమాని తలపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం పర్వాలేదు.. ఐటెం సాంగ్ యూత్ కి కనెక్ట్ అవుతుంది.. ఎడిటింగ్ పర్వాలేదు. తక్కువ నిడివి ఉండడం కూడా సినిమాకి కలిసొచ్చే అంశం. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్: 3
చివరగా: రా ఎలిమెంట్స్ తో యూత్ ను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్ టైనర్