విశాఖపట్నం సమీపంలోని అసకపల్లి వద్ద భారీ సెట్ లో కంచర్ల ఆఖరి షెడ్యూలు

0
462

ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు ఉపేంద్ర గాడి అడ్డా చలనచిత్రం ద్వారా సుపరిచితం అయిన హీరో కంచర్ల ఉపేంద్ర గారి నుండి 2 వ చలనచిత్రం గా కంచర్ల ను ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా మీడియా మిత్రులతో ప్రొడ్యూసర్ DR. కంచర్ల అచ్యుతరావు గారు మాట్లాడుతూ….పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.పూర్తి స్థాయి కుటుంబ కధ – యాక్షన్ తో ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అల్లరిస్తుందని,ప్రముఖ ఫైట్ మాస్టర్ పుష్ప ఫేమ్ డ్రాగన్ ప్రకాష్ గారితో ప్రస్తుతం ఫైట్స్ ను నిర్మిస్తున్నాం..ఫిబ్రవరి లో విడుదల కి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
హీరో ఉపేంద్ర బాబు మాట్లాడుతూ ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని తప్పక అల్లరిస్తుందని,చక్కని కధ ని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని అన్నారు.

చిత్ర యూనిట్ తో నూతన సంవత్సర వేడుకలను ఘనం గా నిర్వహించారు.
ఈ సినిమా కి దర్శకత్వం : యాద్ కుమార్ DOP: గుణశేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here