న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్లు ఇప్పుడు కొత్త జానర్లలో సినిమాలు చేస్తూ.. కొత్త మేకింగ్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. కొత్త దర్శకులు స్క్రీన్ మీద వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్టులతో వచ్చే చిత్రాలు ఇప్పుడు ఆడియెన్స్‌ను బాగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఓ కొత్త కథాంశంతోనే ‘కలియుగం పట్టణంలో’ అనే చిత్రం రాబోతోంది.
నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై ‘కలియుగం పట్టణంలో’ అనే చిత్రం రాబోతోంది. ఈ మూవీలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
#KaliyugamPattanamlo movie completed shooting and post-production works are progressing at a brisk pace.
Theatrical release in February@nanimovieworks & #RaamaaCreations@actor_vishva #AayushiPatell@ramakhanthreddy @Obulkandula87#GaddamMaheshwaraReddy#KatamRamesh… pic.twitter.com/VfG6HVh9K3
— BA Raju's Team (@baraju_SuperHit) January 2, 2024
తొలి ప్రయత్నంగా ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు రమాకాంత్ రెడ్డి ప్రయోగం చేశారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. సినిమా బాగా రావడంతో చిత్రయూనిట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్ వంటి టాప్ టెక్నీషియన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల వంటి వారు పాటలకు సాహిత్యాన్ని అందించారు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టనున్నారు.
నటీనటులు : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్
సాంకేతిక బృందం
బ్యానర్ : నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్
నిర్మాతలు : డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్
దర్శకుడు : రమాకాంత్ రెడ్డి
సంగీత దర్శకుడు : అజయ్ అరసాడ
కెమెరామెన్ : చరణ్ మాధవనేని
సాహిత్యం : చంద్రబోస్, భాస్కర భట్ల
ఎడిటర్ : గ్యారీ బీహెచ్
పీఆర్వో : సాయి సతీష్