మా ‘డెవిల్’ సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు : నందమూరి కళ్యాణ్ రామ్

0
158

డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు  నందమూరి  కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్.  అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుదలైన మంచి రెస్పాన్స్‌ని రాబట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ హైదరాబాద్ లో  డెవిల్ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో…..

నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘మా ‘డెవిల్’ సినిమాను పెద్ద సక్సెస్ చేసిన నందమూరి అభిమానులు, తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అందరికీ రుణపడి ఉంటాను. సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీ అంతా బావుంటుంది. కాబట్టి సినిమా సక్సెస్ లో భాగమైన అందరికీ థాంక్స్. రెండేళ్ల కష్టమే మా డెవిల్ చిత్రం. 1940 బ్యాక్ డ్రాప్ చేయటం అంత సులభం కాదు. శ్రీకాంత్ ఏడాది పాటు కథతో ట్రావెల్ అయ్యారు. ఈ సినిమా స్టార్ట్ చేసిన కొన్ని రోజులకు సౌందర్ రాజన్ గారికి గుండె ఆపరేషన్ జరిగింది. డాక్టర్స్ మూడు నాలుగు నెలలు రెస్ట్ అవసరం అని చెప్పినా పద్దెనిమిది రోజుల్లోనే సెట్స్ లోకి అడుగు పెట్టేశారు. సినిమాపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది.

మా ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ అయిన అభిషేక్ నామాగారు బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టి మంచి ప్రొడక్షన్ వేల్యూస్ అద్భుతంగా డైరెక్ట్ చేశారు. వాసుగారు, మొహిత్, నవీన్ అందరూ మిగతా ప్రొడక్షన్ వ్యవహారాలను చక్కగా డీల్ చేశారు. టీమ్ అంతా ఎంతో కష్టపడ్డాం. శ్రీకాంత్ విస్సా చాలా మంచి కథను అందించారు. బింబిసార రేంజ్ డైలాగ్స్ వస్తాయా అని అనుకున్నాను. కానీ డెవిల్ సినిమా డైలాగ్స్ కు ఎక్స్ట్‌ట్రార్డినరీ రెస్పాన్స్ ఇచ్చారు. కథ, స్క్రీన్ ప్లే ను అందరూ అభినందిస్తున్నారు మా ఆర్ట్ డైరెక్టర్ గాంధీగారు ఎక్సలెంట్ సెట్ వేశారు. మా సినిమాల్లో డెవిల్ బెస్ట్ సెట్స్ తో చేశాం. వెంకట్ మాస్టర్ యాక్షన్ సీక్వెన్సులను అద్భుతంగా చేశారు. ఎడిటర్ తమ్మిరాజుగారితో పటాస్ నుంచి మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ అదే అనుబంధం కొనసాగుతోంది. మా కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ చాలా రీసెర్చ్ చేసి సినిమాలో కొత్త ఫీల్ ను తీసుకొచ్చారు. కాస్ట్యూమ్స్ ను ఇటలీ నుంచి తీసుకొచ్చారు. ప్రతీ సీన్ కొత్తగా అనిపించింది. ఇక నటీనటుల విషయానికి వస్తే షఫీగారు చాలా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇంకా సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ సహా అందరికీ థాంక్స్. హర్షవర్ధన్ సంగీతం ఎలా ఇస్తారోనని అనుకున్నాను. ఎందుకంటే ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ మెయిన్ పిల్లర్ హర్ష ఎలా ఇస్తాడోనని అనుకున్నాను. అయితే దర్శక నిర్మాత అభిషేక్ గారు నమ్మకంతో ముందుకెళ్దామని నాకు చెప్పారు. అనిమల్ తోనూ తను మరో సక్సెస్ కొట్టారు. తనకు థాంక్స్’’ అన్నారు.

షఫి మాట్లాడుతూ ‘‘డెవిల్ కథపై నమ్మకంతో రూపొందించిన అభిషేక్ నామాగారికి థాంక్స్. 1940 బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసేటప్పుడు ఎంతో కష్టపడ్డాం. సినిమా షూటింగ్ కే ఇలా ఉంటే, అప్పట్లో భారతీయులు ఎన్ని కష్టాలు పడుంటారోననిపించింది. ఇలాంటి కథను నమ్మి హీరోగా నటించిన కళ్యాణ్ రామ్ గారికి స్పెషల్ థాంక్స్. సౌందర్ రాజన్ గారి సినిమాటోగ్రఫీ, గాంధీగారి సెట్స్, తమ్మిరాజుగారి ఎడిటింగ్, హర్షవర్ధన్ రామేశ్వర సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నింటికీ మంచి ప్రశంసలు వస్తున్నాయి. నందమూరి అభిమానులకు డెవిల్ మంచి ట్రీట్ లాంటి మూవీ’’ అన్నారు.

చిత్ర దర్శకుడు, నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘‘డెవిల్  సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఎమోషనల్ గా ఉంది. ఎందుకంటే రెండున్నరేళ్ల కష్టమిది. సినిమాను ఆడియెన్స్ తో కలిసి చూస్తుంటే ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది. ఎంటైర్ టీమ్ సపోర్ట్ తోనే ఈ బ్లాక్ బస్టర్ ప్రొడక్ట్ ను చేయగలిగాం. కళ్యాణ్ రామ్ గారి సపోర్ట్, గైడెన్స్ తో డెవిల్ లాంటి మంచి సినిమాను చేయగలిగాం. ఈ జర్నీలో పార్ట్ అయిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో వెంకట్ మాస్టర్, రైటర్ శ్రీకాంత్ విస్సా, షఫీ, సౌందర్ రాజన్, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here