డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా గురించి పలు విషయాలను మీడియాతో మాట్లాడారు…
* 2021లో శ్రీకాంత్ విస్సా వచ్చి నాకు డెవిల్ కథను నెరేట్ చేశారు. అప్పుడు 1940 బ్యాక్ డ్రాప్‌తో సాగే ఆ కథలో హీరో క్యారెక్టర్ డిఫరెంట్‌గా అనిపించింది. షెర్లాక్ హోమ్స్ సినిమాలను గమనిస్తే అందులో ఇన్వెస్టిగేటివ్ చేస్తుంటారు కదా.. ఆ తరహా సినిమా డెవిల్. కథ వినగానే నన్ను దృష్టిలో పెట్టుకునే ఈ కథను చేశారా? అని నేను అడిగాను. అప్పుడాయన మాట్లాడుతూ నేను దీన్ని కథగానే చేశాను. అభిషేక్ నామాగారు మీకు నెరేట్ చేయమంటే కమర్షియల్ హీరో కదా, ఆయన ఒప్పుకుంటారా అని అనున్నా అన్నారు. అప్పుడు నేను శ్రీకాంత్‌కి రెండు విషయాలు చెప్పాను. హీరో క్యారెక్టర్, బ్యాక్ డ్రాప్ అలాగే ఉండనిచ్చి కమర్షియల్ పంథాలో స్క్రిప్ట్ లో మార్పులు చేస్తే సినిమా చేద్దామని అన్నాను. అప్పటికే బింబిసార సినిమా సగం పైగానే పూర్తయ్యింది. మనం ఎలాంటి సినిమా చేస్తున్నాం. ఎలా వస్తుందనేది అప్పటికే ఓ ఆలోచనకు వస్తుంది. కాబట్టి శ్రీకాంత్‌కి స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని సూచించాను. దాంతో శ్రీకాంత్ రెండు, మూడు నెలలు కూర్చుని మార్పులు చేర్పులు చేశారు. తర్వాత స్క్రిప్ట్ వర్క్ చేశాం. దీనికి ఏడాది సమయం పట్టింది. మేకింగ్ కోసం ఏడాది సమయం పట్టింది.
* ప్రేక్షకులకు కొత్త సినిమాలను అందించాలని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ఒక్కసారి కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవుతుంటాను. ఉదాహరణకు ఎమిగోస్ సినిమా విషయానికి వస్తే అందులో డాపల్ గ్యాంగర్ అనే కొత్త కాన్సెప్ట్ ఉంది. దాన్ని చెప్పే క్రమంలో ఎక్కడో ఇంకొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనే ఆలోచన నాకు ఆరోజు రాలేదు. డైరెక్టర్ తో కూర్చుని మాట్లాడి ఆ పని చేసుండాల్సి. ఆ తప్పు నాదే. అందువల్ల మిస్ ఫైర్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ సినిమా విషయంలో కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇన్వెస్టిగేటివ్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి ఉండటం నాకు కొత్తగా అనిపించింది. ఇది పక్కా ఫిక్షనల్ మూవీ.
* సౌందర్ రాజన్‌గారు సినిమాటోగ్రాఫర్ అనగానే నేను కథ వినేటప్పుడు ఎలా ఉంటుందని అంచనా వేసుకున్నానో దాన్ని మించేలానే విజువల్స్ ఉంటుందని నిర్ణయించుకున్నాను. అలాగే రాజేష్ తో 2017 నుంచి వర్క్ చేస్తున్నాను. డెవిల్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసినప్పుడు.. హీరో లుక్ ఎలా ఉండాలని అనుకున్నప్పుడు రాజేష్ రెఫరెన్స్ తీసుకొచ్చి చూపించారు. అది చూడగానే నాకు హ్యాపీగా అనిపించింది. నా క్యారెక్టర్‌కి భారతీయతను ఆపాదించే ప్రయత్నం చేశారు.
.@NANDAMURIKALYAN #NandamuriKalyanRam Clicks From Media Interaction Today #Devil @AbhishekPicture pic.twitter.com/JKWgcDQmGK
— BA Raju's Team (@baraju_SuperHit) December 26, 2023
* పాత్రను చేసేటప్పుడు నేనేమీ ప్రత్యేకమైన పద్ధతులన పాటించను. కథలో ఉండే క్యారెక్టర్ మనకు కొత్తగా అనిపిస్తే.. మన డైలాగ్ డెలివరీ, నటించే పద్ధతి అన్నీ మారిపోతాయి.
* డెవిల్ సినిమాలో హై మూమెంట్స్, దేశభక్తి గురించి చెప్పాలంటే సినిమా చూడాల్సిందే.
* హర్షవర్ధన్ రామేశ్వర్ గురించి చెప్పాలంటే అర్జున్ రెడ్డి సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ చేశారని అభిషేక్ నామాగారు చెప్పారు. తనే డెవిల్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పారు. అర్జున్ రెడ్డి సినిమాకు హర్ష అందించిన బీజీఎం చాలా బావుంది. డెవిల్ విషయానికి వస్తే పాటలు ఓ వైపు ఉంటే.. బ్యాగ్రౌండ్ స్కోర్ దాన్ని బ్యాలెన్స్ చేసేలా ఉండాలి. బింబిసారలో కీరవాణిగారిలా న్యాయం చేస్తాడా అనిపించింది. అయితే సినిమా చూసిన తర్వాత హ్యాపీగా అనిపించింది.
* డెవిల్ సినిమాలో ఎలాంటి గ్రే షేడ్స్ ఉండవు. ప్రతి విషయాన్ని ఎంటైర్ టీమ్ ఎంతో డీటెయిల్డ్‌గా వర్క్ చేసి చేశాం. రేపు దాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూసేటప్పుడు ఎంజాయ్ చేస్తారు.
* సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ పాత్రలు చాలా చక్కగా ఉంటాయి. వీరి పాత్రలే కాదు.. ప్రతీ పాత్రకు కథలో ప్రాముఖ్యత ఉంటుంది. హీరోకు సమానంగా సంయుక్తా మీనన్ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే మాళవికా నాయర్ పాత్రకు ప్రాముఖ్యత ఉంది.
* నటనలో ఎంత కష్టపడాలో ప్రొడక్షన్‌లో అంతకు మించి కష్టపడాలి. ఓం సినిమా విషయంలో నాకు ఆ విషయం అర్థమైంది. ఆ తర్వాత మా బ్యానర్ లో చేసే సినిమాలకు సంబంధించిన కథ వింటాను. మిగిలిన విషయాలను మా హరిగారు చూసుకుంటారు.
* డెవిల్ సినిమాకు సీక్వెల్ గురించి ఓసారి డిస్కషన్ చేశాం. 40-50 శాతం స్క్రిప్ట్ వర్క్ అయితే చేశాం. ఓ దశలో షూటింగ్ కూడా చేయాలనుకున్నాం. కానీ వద్దనుకున్నాం. డిసెంబర్ 29న డెవిల్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి సీక్వెల్ అనౌన్స్ చేస్తాం.
* ఇప్పుడు ఓ సినిమా సెట్స్ పై ఉంది. దాని తర్వాతే బింబిసార 2 స్టార్ట్ చేస్తాను.
* మేం చేసే సినిమాలు గొప్పగా ఉండాలని అనుకుంటాం. అందుకనే ఔట్‌పుట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. నేను, తారక్ దేవర విషయంలో క్లియర్ ఉన్నాం. ఇద్దరికీ మాకొక క్లారిటీ వచ్చి క్లియర్‌గా లేకపోతే ఓ న్యూస్ గురించి స్పందించ కూడదని నిర్ణయించుకున్నాం.
* నటుడిగా ఇరవై ఏళ్ల జర్నీపూర్తయ్యింది. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నారు. తండ్రిగా, భర్తగా, సినిమాల పరంగా చాలా విషయాలు నేర్చుకున్నాను.