మాస్ మహారాజా రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రెండూ రవితేజను మునుపెన్నడూ లేని మాస్, యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు లాంచ్ చేశారు.
పోలీసులు, గ్యాంగ్‌స్టర్లు, నక్సలైట్లకు కూడా మోస్ట్ వాంటెడ్ అయిన వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో వున్న అనుపమ పరమేశ్వరన్, నవదీప్ తో సీరియస్ గా మాట్లాడుతున్న సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమైంది. “తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా… అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు…” అని నవదీప్ చెప్పిన డైలాగ్ ఆసక్తిని మరింతగా పెంచింది.
ఆయుధం తో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు
ఆయుధం తో విధ్వంసాన్ని ఆపేవాడు దేవుడు
ఈ దేవుడు మంచోడు కాదు… మొండోడు..Topnotch visuals, Extravagant Action, #EagleTrailer promises a high octane spectacle🔥💥#EAGLE 🦅 Trailer is OUT now!#EAGLETrailer – https://t.co/VDmrDQzcjt
Mass… pic.twitter.com/CKOW4WCxpO
— BA Raju's Team (@baraju_SuperHit) December 20, 2023
అతను ఒక మిషన్‌లో ఉన్న క్రూరమైన హంతకుడు. అతను టర్కీ, జర్మనీ, జపాన్‌లో లావాదేవీలు జరిపిన వ్యక్తి. అతను దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాడు. అతని కథ గత 10 సంవత్సరాలలో బిగ్గెస్ట్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్. ఇదంతా రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించిన హీరో రవితేజ గురించి. తనకి కావ్య థాపర్ పాత్ర రూపంలో ఒక గర్ల్ ఫ్రండ్ వుంది. ఆమె తుపాకీలను ద్వేషిస్తుంది, బుల్లెట్లకు భయపడుతుంది కానీ ఆమె జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అభిప్రాయాన్ని మార్చుకుంటుంది.
‘ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు… ఆయుధంతో విధ్వంసం ఆపే వాడు దేవుడు… ఈ దేవుడు మంచోడు కాదు… మొండోడు ’’ అంటూ ట్రైలర్ చివర్లో రవితేజ చెప్పిన డైలాగ్స్ గూజ్ బంప్స్ తెప్పించాయి.
యాక్షన్, డ్రామా, లవ్, ఎమోషన్‌తో ట్రైలర్ ప్యాక్డ్ గా వుంది. ఇంతకుముందు విజయవంతమైన కార్తికేయ2 చిత్రానికి రాసిన మణిబాబు కరణం పవర్ ఫుల్ డైలాగ్‌లు రాశారు. కార్తీక్ ఘట్టమనేని లార్జర్ దెన్ లైఫ్ కథతో రవితేజను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. టేకింగ్ టాప్ క్లాస్. కార్తీక్ ఈ సినిమా ఎడిటర్, మణిబాబు కరణంతో కలిసి స్క్రీన్ ప్లే రాశారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
రవితేజ రెండు విభిన్నమైన గెటప్‌లలో వైవిధ్యం చూపించారు. అతను క్లీన్ షేవ్ లుక్‌లో లవర్‌బాయ్‌గా కనిపిస్తుండగా, గడ్డం, పొడవాటి జుట్టుతో వైల్డ్, రగ్గడ్ గా కనిపించారు. తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆ క్యారెక్టర్‌కి ఇంటెన్సిటీని తీసుకొచ్చాడు. నిజంగానే మాస్ విశ్వరూపం చూపించారు. కావ్య థాపర్ రవితేజ లేడీ లవ్‌గా నటించగా, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో కనిపించింది. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర ముఖ్య పాత్రలలో ఆకట్టుకున్నారు.
కార్తీక్, కమిల్ ప్లోకీ, కర్మ్ చావ్లాల సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, దావ్‌జాంద్ చేసిన అద్భుతమైన స్కోర్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిర్మాణ విలువలు అవుట్ స్టాండింగ్ గా వున్నాయి. ట్రైలర్ అంచనాలని అందుకొని సినిమా చూడాలనే ఉత్కంఠ రెట్టింపు చేసింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ..ఈగల్ కి అద్భుతమైన సౌండ్ ఇచ్చాడు దావ్‌జాంద్. ఖచ్చితంగా ప్రేక్షకులు కొత్త అనుభూతిని ఫీలౌతారు. కార్తిక్ రూపంలో మరో మంచి దర్శకుడు రాబోతున్నాడు. సినిమా చాలా బావుంటుంది. తనకి మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. హీరోయిన్స్ కావ్య, అనుపమ చక్కగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నా హోమ్ ప్రొడక్షన్ లాంటింది. నిర్మాత విశ్వ ప్రసాద్ గారితో మరొక చిత్రం స్టార్ట్ చేయబోతున్నాం. దీనితో కలసి హ్యాట్రిక్ అయిపోవాలని కోరుకుంటున్నాను. నవదీప్, అవసరాల చక్కగా నటించారు. అజయ్ ఘోస్ గారి పాత్రలో ఇందులో మరో హైలెట్. మామూలుగా నవ్వించలేదు. ఇరగదీశారు, నేను తెగ ఎంజాయ్ చేశాను. మా మాటల రచయిత మణి చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారు, చాలా ఇష్టపడి డైలాగ్స్ చెప్పాను. థియేటర్స్ లో కలుద్దాం. జనవరి 13 కుమ్మేద్దాం’’అన్నారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. గత ఏడాది రవితేజ గారితో ధమాకా అనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాం. ఈ సంక్రాంతి కి నెక్స్ట్ బ్లాక్ బస్టర్ కి రెడీ అవుతున్నాం. ఈగల్ లో మీకు కావాల్సిన యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ అన్నీ వుంటాయి. జనవరి 13న అందరూ థియేటర్స్ లో ‘ఈగల్’ చూడాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ… కొన్నేళ్ళ క్రితం రవితేజ గారితో పని చేసే అవకాశం వచ్చింది. కానీ అప్పుడు కుదరలేదు. అయితే మళ్ళీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది ఫైనల్ గా ఈగల్ లో మళ్ళీ ఈ అవకాశం వచ్చింది. రవితేజ గారికి ధన్యవాదాలు. కార్తిక్ తో వర్క్ చేయడం ఇది నాలుగోసారి. టీం అందరికీ థాంక్స్. సంక్రాంతి అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. రవితేజ గారికి, నిర్మాత విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు. ‘ఈగల్’ పండక్కి గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రం. తప్పకుండా అందరూ జనవరి 13న థియేటర్స్ లో చూడాలి’ అని కోరారు.
కావ్య థాపర్ మాట్లాడుతూ.. ట్రైలర్ రిలీజ్ వేడుకని మీ అందరితో జరుపుకోవడం ఆనందంగా వుంది. టీంఅందరికీ థాంక్స్. జనవరి 13 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’అన్నారు.
నవదీప్ మాట్లాడుతూ.. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా అనిపిస్తోంది. ట్రైలర్ సాంపిల్ మాత్రమే. సినిమాలో చాలా వుంది. అన్నీ దాచాం. ఈగల్ రవితేజ గారిని ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా చూస్తారు. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఈగల్ సంక్రాంతికి ప్రేక్షకుల మనసుని గెలుచుకుంటుంది’’ అన్నారు.
శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. రవితేజ గారితో నటించే అవకాశం తొలిసారి వచ్చింది. రవితేజ గారికి, విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, కార్తిక్ థాంక్స్’’ చెప్పారు. ఈ వేడుకలో మిగతా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈగల్ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: రవితేజ, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా, ధ్రువ, ఎడ్వర్డ్, మద్ది, జరా, అక్షర
సాంకేతిక విభాగం:
ఎడిటింగ్, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: టిజి విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
రచన: కార్తీక్ ఘట్టమనేని, మణిబాబు కరణం
మాటలు: మణిబాబు కరణం
సంగీతం: డేవ్ జాంద్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, కమిల్ ప్లాకి, కర్మ్ చావ్లా
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
సాహిత్యం: చైతన్య ప్రసాద్, కేకే, కళ్యాణ్ చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
యాక్షన్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్, టోమెక్
పీఆర్వో : వంశీ-శేఖర్
VFX : డెక్కన్ డ్రీమ్స్