తికమకతాండ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

0
108

తికమకతాండ అనే ఊర్లోని ప్రజలందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో డిసెంబర్ 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ట్విన్స్ హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా యాని, రేఖ నిరోషా హీరోయిన్లుగా వెంకట దర్శకత్వంలో వస్తున్న సినిమా తికమకతాండ. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా ప్రొడ్యూసర్స్ సి. కళ్యాణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు మరియు ప్రసన్నకుమార్ గారు వచ్చి మూవీ టీం కి అభినందనలు తెలిపారు.

ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ గారు మాట్లాడుతూ : నేను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావడానికి గల కారణం రమణ ఇప్పుడు మీ అందరూ పిలుచుకునే వెంకట్ గౌతమ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి ఈరోజు నా తికమకతాండ అనే మూవీతో మన ముందుకి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. చాలా కష్టపడ్డారు ఈ సినిమా తీయడానికి ఈ సినిమా వెంకట్ కి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ట్విన్స్ టెక్నీషియన్స్ గా వచ్చి హీరోలుగా ఎదిగింది ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ కానీ డైరెక్ట్ గా ఈ ట్విన్స్ రామ్, హరి ఇద్దరూ హీరోలుగా తెలుగ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు అలాగే హీరోయిన్లు యాని, రేఖ నిరోషా అందరూ చాలా కష్టపడి సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. టి ఎస్ ఆర్ మూవీ మేకర్స్ పైన తిరుపతి శ్రీనివాసరావు గారు ఎంతో కష్టపడి వెంకట్ ని నమ్మి సినిమాని నిర్మించారు సో అందరికీ సినిమా మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న సినిమా బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది సో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమాగా ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ : ఇందాకే సినిమా ట్రైలర్ చూసాము చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది టిఎస్ఆర్ మూవీ మేకర్స్ పై తిరుపతి శ్రీనివాస్ గారు నిర్మించిన ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను. వెంకట్ చాలా కష్టపడే వ్యక్తి కొంచెం టైం పట్టింది దర్శకుడుగా రావడానికి కానీ కష్టానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా ఉంటుంది ఈ సినిమా తనకి మంచి సక్సెస్ అవ్వాలని అవుతుందని కోరుకుంటున్నా అన్నారు.

ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ : తికమకతాండ ఈ టైటిలే చాలా విచిత్రంగా అనిపించింది టైటిల్ బేస్ చేసుకుని సినిమాలు హిట్ అయినా ఉన్నాయి సో ఇది కూడా అలాంటి కోవలోకే చెందుతుంది. వెంకట్ గౌతమస్యమైన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి ఈ రోజున తన దర్శకత్వంలో తికమకతాండా అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు సో కచ్చితంగా దానికి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న. అలాగే హీరోలు హరికృష్ణ, రామకృష్ణ హీరోయిన్స్ యాని, రేఖా నిరోషాకి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ రోజున చిన్న సినిమా పెద్ద సినిమ అని లేదు ఒక మంచి సినిమా మాత్రమే. ఈ సినిమా కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఆదరించి మంచి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్న అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు మాట్లాడుతూ : ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం దొరకడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకట్ గారికి ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు.

డైరెక్టర్ వెంకట్ గారు మాట్లాడుతూ : ముందుగా ఈ కథ ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాస రావు గారికి చెప్పినప్పుడు ఆయన ఒకటే చెప్పారు నేను నా కొడుకులు కోసమే ఈ సినిమా తీయడానికి రెడీ అవుతున్నాను అన్నారు. హీరోల హరికృష్ణ రామకృష్ణ కి స్టొరీ బాగా నచ్చడంతో ఈ సినిమా మొదలైంది. హరికృష్ణ, రామకృష్ణ, యాని, రేఖ అందరూ బాగా సపోర్ట్ చేశారు. శివన్నారాయణ గారు, రాకెట్ రాఘవ, యాదమ రాజు, భాస్కర్ ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా చాలా హైలెట్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారు. నేను ఏదో పెద్ద తోపు సినిమా తీశానని చెప్పను ఒక మంచి సినిమా తీశాను అని అయితే కచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. అలాగే ఈ మూవీ కి సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రొడ్యూసర్స్ శ్రీ కళ్యాణ్ గారు దామోదర్ ప్రసాద్ గారు మరియు ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ : మా ఈవెంట్ కి సపోర్ట్ చేయడానికి వచ్చిన సి. కళ్యాణ్ గారికి దామోదర్ ప్రసాద్ గారికి ప్రసన్న కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. చాలా కష్టపడి ఈ సినిమా తీశాం తెలుగు ప్రేక్షకులు మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నామన్నారు.

హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ : ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన వెంకట్ గారికి ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాస్ రావు గారికి ధన్యవాదాలు. నా కోస్టార్స్ హరికృష్ణ, రామకృష్ణ, యాని తో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ మా అందరికీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

https://twitter.com/baraju_SuperHit/status/1732604116583788729?t=7zh1qg8tMa9be8lgAMqqFw&s=19

హీరోయిన్ యాని మాట్లాడుతూ : నా చిన్నతనం నుండి సినిమాలు చేస్తున్న నా లైఫ్ లో నాకు మర్చిపోలేని క్యారెక్టర్ వచ్చింది రాజన్న మూవీ నుంచి ఎప్పటికీ ఆ సినిమా లో అవకాశం ఇచ్చిన విజయేంద్రప్రసాద్ గారికి నాగార్జున గారికి కృతజ్ఞతలు. నేను ఈ స్థాయిలో ఉండడానికి నా తల్లిదండ్రులే కారణం వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇప్పుడు హీరోయిన్ గా ఈ సినిమా నా అవకాశం ఇచ్చిన వెంకట్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా మరి టీం అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

హీరోలు హరికృష్ణ, రామకృష్ణ మాట్లాడుతూ : ఈ సినిమా మా దగ్గర డబ్బు ఉంది కదా అని తీయలేదు సినిమా మీద మాకు ఉన్న ప్యాషన్ తో చేసాం. మా నాన్నగారు మాతో ఈ సినిమా నేను మీకు ఒక స్టెప్పింగ్ లాగే చూపిస్తున్న మీ కష్టంతో మీరు పైకి ఎదగాలి అని చెప్పారు. ఆయన మా పై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతాం అలాగే మా బ్యానర్ పేరుని కూడా నిలబెడతామన్నారు.

తిరుపతిసత్యం సమర్పించు
నిర్మాణం: టి ఎస్ ఆర్ మూవీమేకర్స్
నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు
దర్శకుడు : వెంకట్
తారాగణం : హరికృష్ణ, రామకృష్ణ , యాని , రేఖ నిరోష, శివన్నారాయణ, రాకెట్ రాఘవ, యాదమ రాజు, భాస్కర్
కథ : నిరూప్‌కుమార్‌
డి ఓ పి : హరికృష్ణన్
ఎడిటర్ : కుమార్ నిర్మలాసృజన్
సంగీత దర్శకుడు : సురేష్ బొబిల్లి
పి ఆర్ ఓ : మధు వి ఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here