కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ – హీరో నితిన్

0
170

నితిన్‌ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ఈ మూవీ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు నితిన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

రెండున్నరేళ్ల క్రితం వక్కంతం వంశీ గారు ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’  లైన్ చెప్పారు. ఆ తరువాత స్క్రిప్ట్‌గా మారడానికి టైం పట్టింది. గత ఏడాది ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. నా గత సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఈ ప్రాజెక్ట్ మీద నేను ఎక్కువగా ఫోకస్ పెట్టాను. ఈ మూవీలోని ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్ వక్కంతం వంశీ గారే రాశాను.

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. జూనియర్ ఆర్టిస్ట్ కారెక్టర్ పోషించాను. అలా అని వారికి ఉండే కష్టాలను చూపించలేదు. ఇప్పుడు ఆ కష్టాలను చూపించినా జనాలను చూడరు. ఎవరి కష్టాలు వారికే ఉన్నాయి. ఈ మూవీ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ మోడ్‌లోనే ఉంటుంది.

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’  మూవీలో స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. హీరో కారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు వక్కంతం వంశీ రాసిన కారెక్టర్లలో ఈ కారెక్టర్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ కాకుండా ఫాదర్ అండ్ సన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’  కథ కొత్తది కాకపోయినా పాయింట్ కొత్తగా ఉంటుంది. మేకింగ్, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ఇలాంటి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఈ మధ్య కాలంలో రాలేదని మా అభిప్రాయం. ఆ భర్తీని ఈ సినిమా ఫుల్ ఫిల్ చేస్తుంది. కుటుంబమంతా చూడదగ్గ వినోదాత్మకంగా చిత్రంగా తెరకెక్కించాం.

సంపత్ గారు ఇది వరకు పోలీస్, తండ్రి పాత్రలు పోషించారు. కానీ ఇందులో చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలో రావు రమేష్ గారి పాత్ర తరువాత సంపత్ గారి పాత్రకే జనాలు ఎక్కువగా కనెక్ట్ అవుతారు.

ఓ కమర్షియల్ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుందో.. శ్రీలీల పాత్ర అలానే ఉంటుంది. రాజశేఖర్ గారి పాత్ర సెకండాఫ్‌లో ఉంటుంది. ఆయన వచ్చాకే సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుంది. అసలు ఆయన ఈ కారెక్టర్ ఒప్పుకుంటాడా? లేదా? అనుకున్నాం. కానీ వక్కంతం వంశీ ముందు నుంచి ఆ పాత్రకు ఆయన్నే అనుకున్నారు. శివానీ, శివాత్మికలు సైతం రాజశేఖర్ గారిని ఒప్పించారు. చివరకు ఆయన మా సినిమాను ఒప్పుకున్నారు.

నాగవంశీ గారితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ట్విట్టర్లో అలా సంభాషించుకున్నాం. నెక్ట్స్ వారి బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాను. మొన్నీమధ్యే గుంటూరుకారం సెట్స్‌కు వెళ్లాను. అక్కడ పాటను చిత్రీకరిస్తున్నారు.

సినిమాలో ఆర్టిస్టులంతా ఎంజాయ్ చేస్తూ నటించాం. సెట్స్‌లో ఎంతో సరదాగా ఉండేది. సీన్లు చేస్తూ ఉన్నప్పుడు కూడా నవ్వుకుంటూ ఉండేవాళ్లం.

హారిస్ జయరాజ్ గారి సంగీతం నాకు చాలా ఇష్టం. ఆయన మంచి మెలోడీస్ ఇస్తారు. ఇందులో అన్ని రకాల పాత్రలు బాగా ఇచ్చారు. ఆర్ఆర్ చాలా కొత్తగా ఉంటుంది.

ఆర్ఆర్ఆర్‌లాంటివి చేయాలని, ఆస్కార్ వరకు వెళ్లాలనే పెద్ద కోరిక లేదు. నేను ఇక్కడే సినిమాలు చేస్తాను. అవి నచ్చితే పక్క భాషల్లోకి డబ్ చేస్తాం. పుష్ప కూడా ముందు తెలుగులోనే అనుకున్నారు. కానీ దాని రీచ్ పెరగడంతో అన్ని భాషల్లోకి డబ్ చేశారు.

నాకు దైవ చింతన, భక్తి ఎక్కువ. మళ్లీ ఆ జానర్‌లో ఓ సినిమా చేయాలని ఉంది. శ్రీ ఆంజనేయం తరువాత మళ్లీ నాకు అలాంటి కథలు ఎవ్వరూ చెప్పలేదు. ఎవరైనా అలాంటి కథతో వస్తే సినిమా చేయాలని ఉంది.

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’  కథను వంశీ ఎన్ని సార్లు చెబుతూ ఉన్నా.. విన్న ప్రతీసారి నవ్వుతూనే ఉన్నాను. నాకు ఈ కథ, ఆ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అంత బాగా నచ్చింది. కథ విన్నప్పుడే కాదు.. తెరపైకి వచ్చాక కూడా అంతే వినోదాత్మకంగా అనిపించింది.

వెంకీ కుడుముల, నేను కలిసి చేస్తున్న సినిమాలో ముందుగా రష్మికను హీరోయిన్‌గా అనుకున్నాం. కానీ ఆమెకు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమెస్థానంలోకి శ్రీలీల వచ్చారు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో శ్రీలీల పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. ఈ చిత్రంలో నేను కామెడీ చేస్తే.. ఆ సినిమాలో శ్రీలీల కామెడీ చేస్తుంది. అందులో శ్రీలీల కారెక్టర్ ఇంకా బాగుంటుంది.

దిల్, ఇడియట్‌లాంటి సినిమాల్లో ఫాదర్ అండ్ సన్ ట్రాక్ కొత్తగా ఉంటుంది. ఫాదర్‌ మీద సన్ కూడా సెటైర్ వేస్తుంటాడు. కానీ ఇందులో ఫాదర్ ముందు సన్ సెటైర్లు వేయడు. బయట హీరోగా కనిపించినా.. ఇంట్లో తండ్రి ముందు అమాయకంగానే ఉంటాడు.

హ్యారీస్ జయరాజ్ మ్యూజిక్ అందించిన ఆరెంజ్, సైనికుడు సినిమాల్లో పాటలు బాగుంటాయి. కానీ అవి అంతగా ఆడలేదు. ఆ సెంటిమెంట్‌తో మన వాళ్లు ఎక్కువగా ఆయన్ను తీసుకోలేదేమో. ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేద్దామని మేం ఆయన్ను తీసుకున్నాం.

వేణు కుడుముల మూవీని మూడు వారాలు షూట్ చేశాం. వేణు శ్రీరామ్ గారి తమ్ముడు సినిమాకు రెండు వారాలు షూట్ చేశాం. ఇకపై ఈ రెండూ సమాంతరంగా చేస్తాను. ‘మాస్ట్రో’ లాంటి డిఫరెంట్ కథలు, కారెక్టర్లు వస్తే చేస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here