వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. టైటిల్, ట్యాగ్ లైన్ చూస్తుంటే సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరుగుతుంది. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తున్నారు.
రీసెంట్‌గా రిలీజైన ‘డెవిల్’ మూవీ టీజర్, ‘మాయ చేశావే..’ సాంగ్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమా నుంచి ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ అనే లిరికల్ వీడియోను సెకండ్ సాంగ్‌గా రిలీజ్ చేశారు. ఈ పాటను ‘జవాన్’ చిత్రంలో టైటిల్ ట్రాక్‌తో ఆకట్టుకున్న లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ రాజకుమారి పాడటం విశేషం. ఆమె ఎనర్జిటిక్ వాయిస్ పాటకు మరింత ఎట్రాక్షన్‌గా మారింది.
The sizzling song of the year is in full bloom and ready to raise the temperature!https://t.co/7rtP43Rzmr#ThisIsLadyRosy from #DevilMovie out now!#Devil – The British Secret Agent
డెవిల్ – डेविल – டெவில் – ಡೆವಿಲ್ – ഡെവിൽ@NANDAMURIKALYAN @iamsamyuktha_
Directed &… pic.twitter.com/oPnsyydJfI— BA Raju's Team (@baraju_SuperHit) November 27, 2023
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యం వహించిన డెవిల్ సినిమాలో ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ పాటకు శ్రీహర్ష ఇమాని సాహిత్యాన్ని అందించగా రాజకుమార్ ఆలపించారు. బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ ఈ పాటలో అప్పియరెన్స్, డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో నందమూరి కళ్యాణ్ రామ్ తెలుపు రంగు సూట్ డ్రెస్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ సాంగ్ థియేటర్స్‌లో ఆడియెన్స్‌కి కళ్లకు విందులా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
ఎన్నో మంచి చిత్రాను మనకు అందించిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తోంది. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యం వహిస్తుండగా సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. గాంధీ నడికుడికర్ ఈ సినిమాకు ప్రొడఓన్ డిజైనర్‌గా బాధ్యతలను నిర్వహించారు. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
ఏ ఫిల్మ్ బై అభిషేక్ పిక్చర్స్