నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా మూవీ ‘సరిపోదా శనివారం’ గ్రాండ్ గా ప్రారంభం

0
69

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి కలిశారు. మొదటి సినిమా ‘అంటే సుందరానికీ’ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌ అయితే, రెండో సినిమా ‘సరిపోదా శనివారం’ యూనిక్ యాక్షనర్. పూర్తి మాస్, యాక్షన్ అవతార్‌లో నానిని ప్రజెంట్ చేసిన అన్‌చెయిన్డ్ వీడియో మాస్‌ను ఉత్సాహపరిచింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

 

‘సరిపోదా శనివారం’ ఈరోజు దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది. నిర్మాత డివివి దానయ్య దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తం సన్నివేశానికి దిల్ రాజు కెమెరా స్విచాన్ చేయగా, వివి వినాయక్ క్లాప్‌ ఇచ్చారు. తొలి షాట్‌కి ఎస్‌జె సూర్య గౌరవ దర్శకత్వం వహించారు.

 

నాని డిఫరెంట్స్ జోనర్స్ ని ఎంచుకుంటున్నారు. కథ, పాత్ర డిమాండ్ మేరకు మేకోవర్ అవుతున్నారు. ‘సరిపోదా శనివారం’లో రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నారు.

 

ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, తమిళ స్టార్ నటుడు ఎస్.జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.

 

పాన్ ఇండియా మూవీ ‘సరిపోదా శనివారం’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

 

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్.జె సూర్య

 

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి

బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్

సంగీతం: జేక్స్ బిజోయ్

డీవోపీ: మురళి జి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: వా

ల్స్ అండ్ ట్రెండ్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here