దసరా శుభాకాంక్షలతో ‘వ్యూహం’ టీమ్‌ 

0
376

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అనే సంగతి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆర్జీవి దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ సీయం వైయస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని ‘వ్యూహం’ అనే పొలిటికల్‌ డ్రామా తెరకెక్కిస్తున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస నటిస్తున్నారు. శ్రీ రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ప్రముఖ పాత్రలతో కూడిన పోస్టర్‌ను దసరా శుబాకాంక్షలతో విడుదల చేశారు. నవంబర్‌ 10వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న ఈ చిత్రం ట్రైలర్‌ గతవారం విడుదలై ప్రేక్షకుల్లో ఉత్కంఠను క్రియేట్‌ చేసింది. పార్టీ ఆవిర్భావ సభనుద్ధేశించి రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన ‘‘వైయస్‌ఆర్‌ సిపి , వైయస్‌ఆర్‌ సిపి…’’ పాట, ‘‘రావాలి జగన్‌..కావాలి జగన్‌ ..’’ లిరికల్‌ వీడియో సాంగ్స్‌ విడుదలై ప్రజాదరణ పొందుతున్నాయని సినిమా టీమ్‌ తెలియచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here