నవంబర్ 3న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కు వస్తున్న రక్షిత్ అట్లూరి “నరకాసుర” సినిమా

0
139

పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా “నరకాసుర”. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న “నరకాసుర” సినిమా ఉషా పిక్చర్స్ ద్వారా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మూవీ టీమ్ పాల్గొన్నారు.

 

డైరెక్టర్ సెబాస్టియన్ మాట్లాడుతూ – లాక్ డౌన్ లో అంతా షట్ డౌన్ అయినప్పుడు మా నిర్మాతలు రఘు, శ్రీనివాస్ నన్ను పిలిచి ఈ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చారు. రెండేళ్లు “నరకాసుర” సినిమా కోసం మా టీమ్ అంతా కష్టపడ్డాం. గత నెలలోనే ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ఇన్ని రోజుల కష్టం ప్రేక్షకులకు ఎలా రీచ్ అవుతుంది అని టెన్షన్ పడ్డాం. రిలీజ్ కోసం చూస్తుంటే కొందరు ఎంకరేజ్ చేశారు, మరికొందరు డిస్కరేజ్ చేశారు. మంచి బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి. రెండు వేలకు పైగా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అందుకున్న ఉషా పిక్చర్స్ ద్వారా మా సినిమాను నవంబర్ 3న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాకు నేను డైరెక్షన్ చేయడంలో ప్రతి ఒక్క టీమ్ మెంబర్ సపోర్ట్ చేశారు. రక్షిత్ రెండేళ్లు ఒకే గెటప్ మెయింటేన్ చేశాడు. రక్షిత్ వాళ్ల నాన్న నన్నూ వాళ్ల అబ్బాయిలాగే చూసుకున్నాడు. “నరకాసుర” మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. మీరు పోస్టర్ , టీజర్ లో చూసిందే కాదు సినిమాలో ఆశ్చర్యపరిచే అంశాలుంటాయి. మా సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని తెలుగు ప్రేక్షకులకు నమ్మకంగా చెప్పగలను. నరకాసుర అంటే దీపావళి గుర్తుకొస్తుంది. ఈ సినిమాతో దీపావళి వన్ వీక్ ముందుగానే థియేటర్స్ లోకి వస్తుందని చెప్పగలను. అన్నారు.

 

హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ – మా డైరెక్టర్ చెప్పినట్లు రెండేళ్లు ఈ సినిమాకు టీమ్ అంతా కష్టపడ్డాం. ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ బాగా సపోర్ట్ చేశారు. “నరకాసుర” మేమందరం గర్వపడే సినిమా అవుతుందని చెప్పగలను. నాకు ఏ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. మంచి సినిమాలు చేసి తెచ్చుకునే గుర్తింపే నా బ్యాక్ గ్రౌండ్ అనుకుంటున్నా. లండన్ బాబులు, పలాస, “నరకాసుర” , రాబోయే శశివదనే, ఆపరేషన్ రావణ్ .ఈ సినిమాలన్నీ కొత్త కథలతో, కాన్సెప్టులతో ఉంటూ నాకు మంచి పేరు తెస్తాయని ఆశిస్తున్నాను. నా సినిమా రిలీజ్ మధ్య గ్యాప్ వచ్చినా ప్రేక్షకులు ఇంకా పలాస ఫేమ్ గా గుర్తుపెట్టుకున్నారు. కాఫీ ఎస్టేట్ నేపథ్యంగా సాగే సినిమా ఇది. ఈ స్కేల్ సినిమాల్లో “నరకాసుర” బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అవుతుంది. క్లాస్, మాస్ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. ఇందులో యాక్షన్, కామెడీ, ఎమోషన్, లవ్ అన్నీ ఉన్నాయి. “నరకాసుర” సినిమాను రిలీజ్ చేస్తున్న ఉషా పిక్చర్స్ వారికి థ్యాంక్స్. త్వరలో ఏపీలో టూర్ ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ అపర్ణ మాట్లాడుతూ – “నరకాసుర” వంటి మంచి సినిమాలో నేను భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో కమర్షియల్ సినిమాకు కావాల్సిన యాక్షన్, పాటలు, బ్యూటిపుల్ లొకేషన్స్ అన్ని ఎలిమెంట్స్ ప్యాకేజ్ లా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా ఆకట్టుకుంటుంది. థియేటర్స్ లో తప్పకుండా చూడమని కోరుకుంటున్నా. అన్నారు.

 

ప్రొడ్యూసర్ డాక్టర్ అజ్జ శ్రీనివాస్ మాట్లాడుతూ – నేను వృత్తి రీత్యా డాక్టర్ ను. అయితే సినిమాలంటే ప్యాషన్. లాక్ డౌన్ టైమ్ లో నా మిత్రుడు రఘు ఈ కథ నా దగ్గరకు తీసుకొచ్చాడు. కథ బాగా నచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. కోవిడ్ వల్ల షూటింగ్ ఆలస్యమైంది. షూటింగ్ టైమ్ లోనే ఒక రోడ్డు యాక్సిడెంట్ లో మా డైరెక్టర్ కు గాయాలయ్యాయి. ఆర్నెళ్లు రెస్ట్ తీసుకున్నారు. హెల్త్ ఇబ్బందిగా ఉన్నా మా డైరెక్టర్ కన్విక్షన్ తో ఈ సినిమాను కంప్లీట్ చేశాడు. రక్షిత్ పర్ ఫార్మెన్స్ సినిమాలో హైలైట్ అవుతుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా మూవీకి సపోర్ట్ చేశారు. థియేటర్ లో మా “నరకాసుర” సినిమాను చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.

 

ఉషా పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ మాట్లాడుతూ – “నరకాసుర” సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ రిలీజ్ చేస్తున్నాం. ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కు థాంక్స్. సినిమా చూశాం. చాలా బాగుంది. మంచి డేట్ కు సినిమా వస్తోంది. అన్ని వర్గాల ఆడియెన్స్ కు రీచ్ అవుతుందని నమ్మకం ఉంది. అన్నారు.

 

 

నటీనటులు – రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్, శతృ, నాజర్, చరణ్ రాజ్, తేజ చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్ తదితరులు

 

సాంకేతిక నిపుణులు :

 

బ్యానర్స్ : సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిల్మ్ మేకర్స్

నిర్మాత : డాక్టర్ అజ్జ శ్రీనివాస్

సహ నిర్మాతలు : కారమూరు రఘు, డా॥ ఏ రాఘవేంద్ర

ఎడిటింగ్ : సిహెచ్ వంశీకృష్ణ

సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి

సంగీతం : ఏఐఎస్ నాఫాల్ రాజా

యాక్షన్ : రోబిన్ సుబ్బు

పిఆర్ఓ : జీఎస్ కే మీడియా

రచన, డైరెక్షన్ : సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here