”భరతనాట్యం” ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే యూనిక్ ఎంటర్టైనర్ : టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్  

0
174

సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్ర, పాయల్ సరాఫ్, పీఆర్ ఫిల్మ్స్ భరతనాట్యం టీజర్ లాంచ్

దొరసాని ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో సూర్య తేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘భరతనాట్యం’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవల, మేకర్స్ హీరోని స్టైలిష్ లుక్‌ లో ప్రజెంట్ చేసే ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను లాంచ్ చేసిన ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈరోజు చిత్ర టీజర్‌ ను లాంచ్ చేశారు.

తన కథలో హీరోలా జీవితంలో అనేక సమస్యలు ఉన్న యంగ్ ఫిల్మ్ మేకర్ గా సూర్య తేజ ని పరిచయం చేస్తూ టీజర్ ప్రారంభమైంది. ఆ దుస్థితి నుంచి బయటపడేందుకు హీరో పెద్ద తప్పు చేయాలని ప్రయత్నిస్తాడు. టీజర్ మనకు ‘భరతనాట్యం’ వరల్డ్ ని పరిచయం చేస్తుంది. సూర్య తేజ తొలి చిత్రంలోనే తన నటనా నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. అన్ని కమర్షియల్ హంగులు ఉన్న సరైన సబ్జెక్ట్‌ ని ఎంచుకున్నాడు. సూర్య తేజ స్వయంగా కథ అందించారు. దర్శకుడు కేవీఆర్ మహేంద్ర కథను గ్రిప్పింగ్‌ గా  ప్రజెంట్ చేశారు.   రిఫ్రెషింగ్ కథ, అద్భుతమైన కథనం మంచి సాంకేతిక  నిర్మాణ ప్రమాణాలతో టీజర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మీనాక్షి గోస్వామి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ వంటి చాలామంది ప్రముఖ నటీనటులు  కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌ పై పాయల్ సరాఫ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ కామెడీని  ఎలివేట్ చేసే స్కోర్ అందించారు, వెంకట్ ఆర్ శాకమూరి కెమెరా పనితనం అద్భుతంగా వుంది. రవితేజ గిరిజాల ఈ చిత్రానికి ఎడిటర్.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో సూర్య తేజ ఏలే మాట్లాడుతూ.. ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇంత మంచి సినిమా చేసిన మా దర్శకుడు కేవీఆర్ మహేంద్ర గారికి ధన్యవాదాలు. మీనాక్షి చాలా హార్డ్ వర్క్ చేసింది. హర్ష వర్ధన్ గారు ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీని మర్చిపోలేను. అలాగే హర్ష గారి పాత్ర బాగుంటుంది. ఇందులో పాత్రలన్నీ అదిరిపోతాయి. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. నా మొదటి సినిమాకి వివేక్ సాగర్ గారు మ్యూజిక్ ఇవ్వడం ఆనందంగా వుంది. ఆర్ఆర్ అదిరిపోతుంది. రవితేజ గిరిజాల క్రిస్ప్ అండ్ నీట్ గా కట్ చేశారు. వెంకట్ గొప్ప ఎనర్జీ ఇచ్చారు. టెక్నిషియన్స్, నటీనటులు అందరూ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తోనే సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది” అన్నారు.దర్శకుడు కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ..దొరసాని సినిమా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ చిత్రం తర్వాత భరతనాట్యం లాంటి యూనిక్ ఎంటర్ టైనర్ తో రావడం ఆనందంగా వుంది. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. వారి ప్రోత్సాహంతో సినిమా అద్భుతంగా వచ్చింది. ఇది రెగ్యులర్ సినిమా కాదు. క్రైమ్ కామెడీ జోనర్ లో చాలా కొత్త ఎలిమెంట్ తో ఇప్పటివరకూ తెలుగు ప్రేక్షకులు చూడని సరికొత్త ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఇలాంటి కథలకు చాలా మంచి నటీనటులు కావాలి. అలాంటి నటులు దొరికారు. సూర్య  పక్కింటి కుర్రాడిలా ఉంటూ తన పాత్రని అద్భుతంగా చేశాడు.  మీనాక్షి చాలా చక్కగా నటించింది. అలాగే హర్ష వర్ధన్  గారి పాత్ర కూడా చాలా బావుంటుంది. అలాగే హర్ష కూడా తెరపై చెలరేగిపోయారు. అజయ్ ఘోష్ గారి పాత్ర కూడా గమ్మత్తుగా వుంటుంది. ఇందులో ప్రతి పాత్రకు ప్రాధన్యత వుంటుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ తో వేరే లెవల్ కి తీసుకెళ్ళారు. అలాగే డీవోపీ వెంకట్ గారు బెస్ట్ వర్క్ ఇచ్చారు. ఎడిటర్ రవితేజ కూడా బెస్ట్ ఇచ్చారు. ఉత్తమ నటీనటులు, సాంకేతికనిపుణులతో బెస్ట్ గా చేసిన సినిమా ఇది. దొరసాని కంటే బెస్ట్ సినిమా అవుతుందనే నమ్మకం వుంది. త్వరలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది” అన్నారు.

హర్ష వర్ధన్ మాట్లాడుతూ.. సూర్య తేజకి  ఇది తొలి సినిమా అయినప్పటికీ చాలా మంచి అనుభవం ఉన్న నటుడిలా చేశారు.  ఈ చిత్రం కథని కూడా తనే రాసుకున్నారు. మంచి యునిక్ కంటెంట్ వున్న సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమాతో సూర్య తనకంటూ ఒక ముద్రవేసుకుంటాడనే నమ్మకం వుంది” అన్నారు

నిర్మాత పాయల్ మాట్లాడుతూ.. ఈ సినిమా మా వారి కల. ఈ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాం. ఈ సినిమా ప్రయాణం అద్భుతంగా జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.” తెలిపారు.

మీనాక్షి మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్’ తెలిపారు

వైవా హర్ష మాట్లాడుతూ… ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఇందులో దాదాపు ఐదు గెటప్స్ లో కనిపిస్తాను. చాలా హిలేరియస్ గా వుంటుంది. సూర్య చాలా ప్రతిభావంతుడు. చాలా అద్భుతంగా నటించాడు. చాలా మంచి టీంతో కలసి ఈ సినిమా చేశాం. తప్పకుండా ఈ సినిమా అందరికీ అలరిస్తుంది’ అన్నారు.

ఆదిత్య నిరంజన్ మాట్లాడుతూ.. సూర్య ఈ చిత్రంతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా వుంది.  చాలా మంచి టీంతో కలసి చేస్తున్న సినిమా ఇది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు.

ధని ఏలే మాట్లాడుతూ.. మా అబ్బాయికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, టీం అందరికీ ధన్యవాదాలు” తెలిపారు

త్వరలోనే సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు  మేకర్స్.

నటీనటులు: సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్, టార్జాన్, మాణిక్ రెడ్డి, శివన్నారాయణ, సత్తన్న, సంతోష్ బాలకృష్ణ

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర
నిర్మాత: పాయల్ సరాఫ్
కథ: సూర్య తేజ ఏలే
స్క్రీన్ ప్లే: సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్ర
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: వెంకట్ ఆర్ శాకమూరి
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
ఆర్ట్: సురేష్ భీమగాని
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్

https://www.youtube.com/watch?v=hYOmBhPk6c8&ab_channel=AdityaMusicIndia

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here