మాస్ మహారాజా రవితేజ ‘ఈగల్’ జనవరి 13న విడుదల

0
184

మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రెండవసారి ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో యూనిక్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’ చిత్రాన్ని చేస్తున్నారు. మేకర్స్ ఇదివరకే రవితేజ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన  టైటిల్‌ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈరోజు, మేకర్స్  ఇంటెన్స్ పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈగల్ 2024 సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది. పోస్టర్‌లో రవితేజ చేతిలో తుపాకీతో నిప్పుఅంటుకున్న అడవిలో స్టైలిష్‌గా నిల్చున్నట్లుగా వుంది. అయితే, పోస్టర్‌లో రవితేజ ముఖం కనిపించదు, అక్కడ మనం రెస్క్యూ టీం విమానం చూడవచ్చు.

సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం.

కార్తీక్ ఘట్టమనేని రచన , దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు కార్తిక్ స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ హైబడ్జెట్ ఎంటర్‌టైనర్ కోసం టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు.మణిబాబు కరణం డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ కూడా. దవ్‌జాంద్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.

తారాగణం: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, కావ్య థాపర్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం:  కార్తీక్ ఘట్టమనేని
స్క్రీన్ ప్లే: కార్తీక్ ఘట్టమనేని& మణిబాబు కరణం
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: దవ్‌జాంద్
ఎడిటర్: కార్తీక్ ఘట్టమనేని
డైలాగ్స్: మణిబాబు కరణం
లిరిక్స్:  చైతన్య ప్రసాద్, రెహమాన్ & కళ్యాణ్ చక్రవర్తి
కో-ఎడిటర్: ఉతుర
కో డైరెక్టర్: రామ్ రవిపాటి
స్టైలిస్ట్: రేఖ బొగ్గరపు
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
యాక్షన్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్ & టోమెక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here