‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసలు

0
142

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించి రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాకు ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీల అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. సినిమా సూపర్ హిట్ అవుతుందని రిలీజ్ ముందు మెగాస్టార్ చిరంజీవి చెప్పగా..తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూశాక దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. స్వీటి అనుష్క ఎప్పటిలాగే అందంగా తెరపై మెరిసింది. నవీన్ పోలిశెట్టి తన నటనతో సరదా పంచుతూ నవ్వులు పూయించాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో సక్సెస్ అందుకున్న టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాట్స్. సెన్సిటివ్ అంశాన్ని నేపథ్యంగా ఎంచుకుని ఇంత ఫన్ తో సినిమాను రూపొందించిన దర్శకుడు పి.మహేశ్ బాబు కు అభినందనలు. అని ఆయన తన రెస్పాన్స్ తెలియజేశారు.

నిన్న తెరపైకి వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ పాజిటివ్ టాక్ కు తగినట్లే మంచి వసూళ్లు దక్కించుకుంటోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌ నిర్మాణంలో దర్శకుడు మ‌హేష్ బాబు.పి తెరకెక్కించారు.

న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి తదితరులు

సాంకేతిక బృందం
బ్యాన‌ర్‌: యువీ క్రియేష‌న్స్‌
నిర్మాత‌లు: వంశీ – ప్ర‌మోద్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ బాబు.పి
సంగీతం : రధన్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్ర‌ఫీ: నిర‌వ్ షా
కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం, బృందా
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రాజీవ‌న్‌
వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌: రాఘ‌వ్ త‌మ్మారెడ్డి
పి.ఆర్.వో : జీ.ఎస్.కే మీడియా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here