క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ కు సిద్ధమవండి…యూ/ఏ సర్టిఫికేషన్ తో తెరపైకి రాబోతున్న నవీన్ పోలిశెట్టి, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.

0
190

 

పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల అభినందనలతో యూఏ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ అనే చివరి అంకాన్ని సక్సెస్ ఫుల్ కంప్లీట్ చేసుకున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఇక తెరపైకి రావడమే తరువాయిగా మారింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ మొదటి నుంచి సినిమా టీమ్ చెబుతున్న మాటలు సెన్సార్ యూఏ సర్టిఫికేషన్ తో ప్రూవ్ అయ్యాయని అనుకోవచ్చు. ఈ సినిమా ఐడియల్ రన్ టైం 151 మినిట్స్ తో తెరపైకి రాబోతోంది.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌ నిర్మాణంలో దర్శకుడు మ‌హేష్ బాబు.పి తెరకెక్కించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఇదే రెస్పాన్స్ రేపు థియేటర్ లోనూ దక్కుతుందని నమ్మకంతో మూవీ టీమ్ ఉన్నారు. మరోవైపు సినిమాను ఆడియెన్స్ కు మరింత దగ్గర చేసేందుకు ప్రమోషన్ టూర్స్ చేస్తున్నారు హీరో నవీన్ పోలిశెట్టి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరులో ఆయన పర్యటిస్తున్నారు. ఈ టూర్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.

https://twitter.com/baraju_SuperHit/status/1697157903323701281/photo/1

న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి తదితరులు

సాంకేతిక బృందం
బ్యాన‌ర్‌: యువీ క్రియేష‌న్స్‌
నిర్మాత‌లు: వంశీ – ప్ర‌మోద్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ బాబు.పి
సంగీతం : రధన్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్ర‌ఫీ: నిర‌వ్ షా
కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం, బృందా
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రాజీవ‌న్‌
వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌: రాఘ‌వ్ త‌మ్మారెడ్డి
పి.ఆర్.వో : జీ.ఎస్.కే మీడియా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here