‘నాతో నేను’ రివ్యూ

0
711

సినిమా: ‘నాతో నేను
విడుదల తేది: 21-07-2023
నటీనటులు : సాయికుమార్‌, ఆదిత్యా ఓం, శ్రీనివాస్‌ సాయి. ఐఽశ్వర్య, దీపాలి రాజ్‌పుత్‌, రాజీవ్‌ కనకాల, సమీర్‌, సివిఎల్‌ నరసింహరావు, గౌతంరాజు, భద్రమ్‌, సుమన్‌శెట్టి తదితరులు.
కెమెరా: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి
సంగీతం: సత్య కశ్యప్‌
బ్యాగ్రౌండ్‌ స్కోర్‌: ఎస్‌ చిన్నా
ఎడిటింగ్‌: నందమూరి హరి
ఆర్ట్‌: పెద్దిరాజు అడ్డాల
బ్యానర్‌: శ్రీభవ్నేష్‌ ప్రొడక్షన్స్‌
సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి
నిర్మాత: ప్రశాంత్‌ టంగుటూరి
దర్శకత్వం: శాంతికుమార్‌ తూర్లపాటి

డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌, రాజీవ్‌ కనకాల, ఆదిత్యా ఓం, శ్రీనివాస్‌ సాయి. ఐఽశ్వర్య, దీపాలి రాజ్‌పుత్‌ కీలక పాత్రఽధారులు రూపొందిన చిత్రం ‘నాతో నేను’. జబర్దస్ట్‌ కమెడీయన్‌గా, మిమిక్రీ ఆర్టిస్ట్‌ బుల్లితెరపై గుర్తింపు పొందిన శాంతికుమార్‌ తూర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మరి చిన్న తెరపై కామెడీతో అలరించిన ఆయన వెండితెరపై తన సత్తా చాటాడా లేదా అన్నది తెలుసుకుందాం.

కథ:
ఓ గ్రామంలో ఉన్నతస్థానంలో ఉన్న కోటీశ్వరరావు (సాయికుమార్‌).. కొన్ని సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే తరుణంలో ఓ స్వామిజీ కోటీశ్వరరావు కలిసి కష్టన్ని తెలుసుకుని ఓ వరమిస్తాడు. కోటిగాడు (సాయి శ్రీనివాస్‌) దీప (ఐశ్వర్య)తో పరిచయం, ఆపై ప్రేమలో పడడం జరుగుతుంది. ఇంటిలో పెద్దలు అంగీకరించకపోవడంతో ఐశ్వర్య సాయి విడిపోతారు. దాంతో అతని జీవితం ఏమైంది. ఓ మిల్లులో పని చేసే కోటిగాడు (ఆదిత్య ఓం) అతను ఇష్టపడిన అమ్మాయి నాగలక్షీ (దీపాలి) మధ్య ఏం జరిగింది. 60 ఏళ్ల సాయికుమార్‌, 40 ఏళ్ల ఆదిత్య ఓం. 20 ఏళ్ల
సాయి శ్రీనివాస్‌ల ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ చివరికి ఏ తీరానికి చేరింది. స్వామిజీ సాయికుమార్‌కి ఇచ్చిన వరం ఏంటి? అన్నది కథ.

నటీనటుల పనితీరు:

కోటీశ్వరుడిగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాయికుమార్‌ అద్భుతంగా నటించారు. ఓ మిల్లులో పని చేస్తూనే తను ఇష్డపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుని మోసపోయిన పాత్రలో ఆదిత్య ఓం నటన తో ఆకట్టుకుంటాడు. ప్రేమ విఫలం పొందిన పాత్రలో సాయి శ్రీనివాస్‌ కూడా బాగా నటించారు. రాజీవ్‌ కనకాల, సివిఎల్‌ నరసింహరావు ఇతర ఆర్టిస్ట్‌లు పాత్రల మేరకు చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

తొలిసారి దర్శకత్వం వహించిన శాంతి కుమార్‌ తూర్లపాటి మూడు కీలక పాత్రల నడుమ సాగే కథను బాగానే రాశారు కానీ.. ఎగ్జిక్యూట్‌ చేయడంలో కాస్త తడబాటు కనిపించింది. మాటలు బావున్నాయి. కామెడీ, భావోద్వేగ సన్నివేశాలు ఆకటుకున్నాయి. రెట్రోసాంగ్‌, ఐటెమ్‌ సాంగ్‌ ఆకట్టుకున్నాయి.

మనిషి అనే దాని కంటే మనీ అనే రెండక్షరాల మీదే జీవితం నడుస్తోంది అన్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. దీనితో 20, 40, 60 ఇలా వయసు దశల వారీగా సాగిన ఈ కథలో సాయికుమార్‌, ఆదిత్యా ఓం, సాయి శ్రీనివాస్‌ పాత్రలను మలచిన తీరు బావుంది. ఆ పాత్రలకు తగ్గట్లు చక్కగా ఆర్టిస్ట్‌లు కూడా నటించారు. ఆ సన్నివేశాలను దర్శకుడు నడిపించిన తీరు కూడా బావుంది. చేసిన మంచి ఎక్కడికీ పోదనే విషయాన్ని చక్కగా చెప్పారు. డబ్బు మాత్రమే పరమావధిగా భావించి దాని వెనకే జీవితం ఉందనుకుంటే చివరికి ఏమీ మిగలదు అనే చక్కని సందేశం ఇచ్చారు.

సాయికుమార్‌ డైలాగ్‌లు గుర్తుండిపోయేలా ఉన్నాయి. రాజీవ్‌ కనకాల, సివిఎల్‌ నరసింహరావు పాత్రలను ఇంకాస్త పెంచి ఉంటే పరిపూర్ణత వచ్చేది. సాయి శ్రీనివాస్‌, ఐశ్వర్య పాత్రలు యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతాయి. ఫస్టాఫ్‌లో కాస్త కత్తెర వేయాల్సింది. సినిమాలో సెట్లు, లొకేషన్లు ఆకట్టుకున్నాయి. నిర్మాతలు కొత్త వారే అయినా ఎక్కడా కాంప్రమైజ్‌ అయినట్లు కనిపించలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి. ఓవరాల్‌గా అయితే చక్కని సందేశంతోపాటు వినోదాన్ని పంచారు. సందేశం, వినోదం మేళవించిన నాతో నేను హాయిగా ఓసారి చూడొచ్చు.

రేటింగ్: 3.25/5

చివరగా: మనిషి కన్నా మనీ అనే రెండు అక్షరాలకే విలువ ఎక్కువ ఇస్తున్నారనే సందేశాన్ని వినోదంతో మేళవించి చెప్పడం అలరిస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here