మణప్పురం ఎస్.ఏ.జె  మిస్‌ గ్లామ్‌ వరల్డ్‌ 2023 పోటీలో  టైటిల్‌ గెలిచిన బెల్జియంకు చెందిన జోమ్కీ టెన్జిన్

0
203
–  రన్నరప్‌గా భారతీయ యువతి… సందడిగా జరిగిన బ్యూటీ కాంటెస్ట్‌…

హైదరాబాద్:  భారతదేశానికి చెందిన  సమృద్ధి శెట్టి మణప్పురం ఎస్.ఏ.జె మిస్‌ గ్లామ్‌ వరల్డ్‌ 2023పోటీలో సెకండ్ రన్నరప్‌గా   నిలిచారు.   విలేకరుల సమావేశంలో SAJ గ్రూప్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ CMD సాజన్ వర్గీస్ మరియు పెగాసస్ చైర్మన్ డాక్టర్ అజిత్ రవి ఈ పోటీల వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో యువతులు దరఖాస్తు చేసుకున్నారు.  ఈ తుది పోటీలో పలు దేశాలకు చెందిన 13 మంది అందమైన యువతులు టైటిల్‌ పోరుకు  హోరాహోరీగా తలపడ్డారు. తుది పోరులో బెల్జియంకు చెందిన జోమ్కీ టెన్జిన్ మణప్పురం SAJ మిస్ గ్లామ్ వరల్డ్ 2023 విజేతగా నిలిచింది. నేపాల్‌కు చెందిన ఆయుషా ప్యకురెల్ ఫస్ట్ రన్నరప్‌గా, భారత్‌కు చెందిన సమృద్ధి శెట్టి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.

మణప్పురం SAJ మిస్ గ్లామ్ వరల్డ్ 2023 గ్రాండ్ ఫైనల్స్ కొచ్చిలోని లీ మెరిడియన్‌లో జరిగిన రంగుల కార్యక్రమంలో SAJ గ్రూప్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ CMD సాజన్ వర్గీస్ మరియు పెగాసస్ చైర్మన్ డాక్టర్ అజిత్ రవి విజేతలకు పట్టం కట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దరఖాస్తుదారుల నుండి ఎంపిక చేయబడిన 13 మంది పోటీదారులు మిస్ గ్లామ్ వరల్డ్ పోటీ కోసం ర్యాంప్‌పై వరుసలో ఉన్నారు. విజేతలకు పరక్కత్ జ్యువెలర్స్ రూపొందించిన అత్యద్భుతమైన బంగారు కిరీటాలను బహూకరించారు.

ఈ పోటీలకు  ఆస్ట్రేలియా నుండి జూలియా ఆన్ కౌట్స్, బెల్జియం నుండి జోమ్కీ టెన్జిన్, భారతదేశం నుండి సమృద్ధి శెట్టి, ఇరాన్ నుండి ఐదా, ఇటలీ నుండి సాండ్రా లోరెనాని, జపాన్ నుండి రిసా నకటాని, నేపాల్ నుండి ఆయుషా ప్యకురెల్, రష్యా నుండి దర్యా పైజియానోవా, సెర్బియా నుండి వెనెరా స్టానిసావ్లీవిక్, సింగపూర్ నుండి జెనీవి శ్రీలంక నుండి రువీనా సమ్మాని గమాచ్చి వితనాగే, తైవాన్ నుండి చియు కె-ఎన్ మరియు జాంబియా నుండి లారిస్కా కలోంగో పోటీ పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here