#NBK108 టైటిల్ , ఫస్ట్ లుక్ జూన్ 8న విడుదల

0
140

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ,  బ్లాక్ బస్టర్ డైరెక్టర్  అనిల్ రావిపూడి   కలిసి #NBK108 తో మాస్, అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని అందించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు జరుపుకోనున్నారు. బాలకృష్ణ అభిమానులకు ఇది చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు కానుంది.  ఎందుకంటే ఈ బర్త్ డే కి చాలా ట్రీట్‌లు ఉన్నాయి. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10)కి రెండు రోజుల ముందుగా అంటే జూన్ 8వ తేదీన ఈ సినిమా టైటిల్,  ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. పవర్ ఫుల్  టైటిల్ లాక్ చేశారు. పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్ చూసేందుకు మనం మరో మూడు రోజులు ఆగాలి. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పెద్ద సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు.

కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ఉగాది సందర్భంగా ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్‌లను ప్రజంట్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ల కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

#NBK108కి  ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. వెంకట్‌ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

NBK108 విజయదశమి (దసరా)కి థియేట్రికల్ విడుదలకు సిద్ధమౌతోంది.

నటీనటులు:  నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ:  సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఫైట్స్: వి వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here