స్టార్‌డం వున్న హీరోలు ఎన్ని ఎక్కువ సినిమాలలో నటిస్తే పరిశ్రమ అంత కళకళలాడుతుంది. ప్రొడక్షన్‌బోయ్ మొదలుకొని ధియేటర్‌లో సైకిల్ స్టాండ్ నడిపేవారివరకూ ఎన్నో వేలమందికి ఉపాధి లభిస్తుంది.
నిరంతరం పరిశ్రమించి లెఖ్ఖకు మించిన సినిమాలలో నటించి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నో వేలమంది కుటుంబాలలో వెలుగును నింపిన వ్యక్తి …శక్తి “సూపర్‌స్టార్ కృష్ణ” గారు.
కొత్తతరం హీరోలు ఆయన్ని ప్రేరణగా తీసుకుంటే పరిశ్రమ పచ్చగా వుంటుందని పలుమార్లు చెప్పేవారు దర్శకరత్న దాసరిగారు.
పరిశ్రమలోకొచ్చిన కొత్తలో నా అభిమాన హీరోతో కొన్నిసినిమాలకు పనిచేయటం, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయనకు డైలాగులు చెప్పటం నాకు దక్కిన అందమైన అనుభవాలు. కల్మషం లేని ఆయన నవ్వంటే నాకెంతో ఇష్టం.
ఈ రోజు (మే 31) ఆ మహానుభావుడి జయంతి.
నేను గీసిన నీటిరంగుల చిత్రంతో నా “సూపర్‌స్టార్” కి నివాళులర్పిస్తున్నాను.
______ దేవీప్రసాద్.