అతి తక్కువ సమయంలోనే వరుస చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకున్న హీరో కి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి గారు తో ప్రారంభమైన ఈ హీరో కెరీర్ చాలా గమ్మత్తుగా సాగుతోంది ఒక హిట్టు తర్వాత ఒక ఫ్లాప్ మళ్లీ హిట్ తర్వాత మరో పరాజయం ఇలా సమాంతర జయాపజయాలతో కిరణ్ కెరీర్ బ్యాలెన్సింగ్ గా ఉంది. కానీ సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా ఈ యువ హీరో వరుసగా చిత్రాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు.
రాజావారు రాణి గారు లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో ప్రామిసింగ్ డెబ్యూట్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నారు. ఆ సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న కొద్ది రోజులకే కోవిడ్ రావడంతో లాంగ్ రన్నింగ్ రాకపోయినా ఓటీటీ లో విడుదలైన తరువాత విశేష ప్రేక్షకాదరణతో జెన్యూన్ హిట్టుగా నిలిచింది. ఆ తరువాత థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలైన ఎస్ఆర్ కళ్యాణమండపం కిరణ్ అబ్బవరం కి తొలి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రంలోని పాటలు, ఫాదర్ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తరువాత వచ్చిన శభాస్టియన్ పిసి 524 బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడకపోయినా ఒక కొత్త ప్రయత్నం గా మన్ననలను అందుకుంది. తరువాత వచ్చిన అర్బన్ లవ్ స్టోరీ సమ్మతమేతో కిరణ్ అబ్బవరం మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తరువాత విడుదలైన నేను మీకు బాగా కావలసిన వాడిని నిరాశపరిచినా వెంటనే విడుదలైన వినరో భాగ్యము విష్ణు కథ తో మరో బాక్స్ ఆఫీస్ హిట్ ను సొంతం చేసుకున్నారు. తాజాగా విడుదలైన పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ మీటర్ తో మరో ఫ్లాప్ ను ఎదుర్కోన్నారు.
మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థలో రూపొందిన మీటర్ కథ విషయంలో అనుకున్న లెక్క తప్పి మిస్ఫైర్ అయింది. ఫలితంగా పరాజయాన్ని మూట కట్టుకుంది. ఇలాంటి ఫ్లాపులు ఇండస్ట్రీలో కొత్త కాదు. ప్రతి హీరో ఏదో ఒక సమయంలో ఇలాంటి పరాజయాల్ని ఎదుర్కొన్నవారే. కానీ ఈ ఫ్లాప్ ని ఇంతకుముందు ఎన్నడూ ఎరుగని పరాజయంగా హైలైట్ చేయడం చూస్తే ఇది కావాలని పని కట్టుకొని చేసినట్లు గా ఎవరికైనా అర్థం అయిపోతుంది. ఇలా జరగడం కిరణ్ అబ్బవరం విషయంలోనే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఎంతోమంది హీరోల విషయంలో ఇలా పనిగట్టుకొని నెగటివ్ ప్రచారం జరిగింది. వారందరూ కూడా తమ తర్వాత చిత్రాలతో సూపర్ హిట్ కొట్టి తిరిగి ఫామ్ లోకి వచ్చారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే కిరణ అబ్బవరం ప్రతి సినిమాకు తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. తన సూపర్ హిట్ చిత్రాల కథ, స్క్రీన్ ప్లే విషయాలలో కూడా ఇన్వాల్వ్ అయిన ఈ హీరో సినిమాల పట్ల చూపించే ఫ్యాషన్ చేసే హార్డ్ వర్క్ లతో తన రాబోయే చిత్రం రూల్స్ రంజన్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.



