సీనియర్ జర్నలిస్ట్ భగీరధకు తెలుగు విశ్వవిదాలయం కీర్తి పురస్కారం

0
131

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భగా సీనియర్ జర్నలిస్టు వ్రాసిన “మహానటుడు,ప్రజానాయకుడు – ఎన్.టి ఆర్” అన్న పుస్తకానికి తెలుగు విశ్వవిదాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. గురువారం నాడు ఉపాధ్యక్షులు టి. కిషన్ రావు భగీరధకు తెలిపారు . జీవిత చరిత్ర విభాగంలో “మహానటుడు,ప్రజానాయకుడు – ఎన్.టి ఆర్” పుస్తకాన్ని ఎంపిక చేసినట్టు కిషన్ రావు గారు స్వయంగా తెలిపారు.

ఈ అవార్డు ప్రదానోత్సవం ఈ నెల 29న తెలుగు విశ్వవిద్యాలయం లో జరుగుతుంది
ఇప్పటికే “మహానటుడు,ప్రజానాయకుడు – ఎన్.టి ఆర్” పుస్తకానికి కమలాకర కళాభారతి మరియు ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ ఎన్. టి .ఆర్ అవార్డులు లభించాయి.

ఎన్ .టి .రామారావు నెలకొల్పిన తెలుగు విశ్వవిద్యాలయం , ఎన్ .టి .ఆర్ శత జయంతి , ఎన్ .టి .రామారావు జీవితం మీద వ్రాసిన ఈ పుస్తకానికి “ఎన్ .టి .ఆర్ . కీర్తి పురస్కారం లభిస్తుందని ఊహించలేదని భగీరథ ఆనందం వ్యక్తం చేశాడు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here