మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి, తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న జాతిరత్నం నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో వస్తోన్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంపై మంచి అంచనాలున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి పి. మహేష్ కుమార్ దర్శకుడు. రీసెంట్ గా విడుదల చేసిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఉగాది పండగ సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించి దర్శకుడు పి మహేష్ కుమార్ వాట్సాప్ నుంచి నోనో నో అంటూ సాగే క్యాచీ పదాలను విడుదల చేశారు. వీటిని చూడగానే ఇది ఓ మంచి పెప్పీ డ్యాన్స్ నంబర్ సాంగ్ గా అనిపిస్తోంది. ఫుల్ సాంగ్ ను ఉగాది రోజు విడుదల చేయబోతున్నారు.
A song every music lover will say yes, yes and yes to🎵🎵#NoNoNo lyrical song from #MissShettyMrPolishetty releasing tomorrow 🥁
Stay tuned… @MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao pic.twitter.com/MskF6qKNN8
— Shiva Kumar B (@ShivaKumarB22) March 21, 2023
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకునేందుకు ఈ వేసవి బరిలోనే తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోంది.
ఈ చిత్రానికి సంగీతంః రధన్, సినిమాటోగ్రఫీః నీరవ్ షా, ఎడిటర్ః కోటగిరి వెంకటేశ్వరరావు, పిఆర్.వోః జి.ఎస్.కె మీడియా, నిర్మాణ సంస్థః యూవీ క్రియేషన్స్, నిర్మాతలుః వంశీ – ప్రమోద్, రచన, దర్శకత్వంః పి. మహేష్ కుమార్.